Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Weather Forecast: ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాల చోట్ల, రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
Weather Latest News: తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుండి వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాల చోట్ల, రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు (30 నుంచి 40 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.8 డిగ్రీలుగా నమోదైంది. 77 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు నవ్ సారి, జల్గావ్, మండ్గా, పెండ్రా రోడ్, ఝూర్పుగూడ, బాలాసోర్, హల్దియా గుండా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శనివారం (జూన్ 22) ఓ ప్రకటనలో తెలిపారు.
నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోని మరికొన్ని భాగాలు, గుజరాత్ రాష్ట్రం, మహారాష్ట్రలోని మిగిలిన భాగాలు, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా, గంగానది, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బిహార్, కొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
అమరావతి వాతావరణ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.