News
News
X

KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్

విద్య, వైద్యం, రైతు సంక్షేమం కుల సంఘాల అభివృద్ధి అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన గౌరవం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.

FOLLOW US: 
Share:

- దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేశాం 
- వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణ, పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
- రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

వరంగల్: విద్య, వైద్యం, రైతు సంక్షేమం తదితర అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలుపరచడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్). రాష్ట్ర పురోగతిని చూసి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వారి రాష్ట్రంలో ఇలాంటి పథకాలు అమలు చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం చదువుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యాసంస్కరణలు చేస్తుందని అన్నారు 

అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే బాలబాలికల రెసిడెన్షియల్ విద్యార్థినీ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో ముచ్చటించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుపరచుందని పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను కొనసాగించేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన విద్య, వైద్యం, రైతు సంక్షేమం కుల సంఘాల అభివృద్ధి అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన గౌరవం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.

అంతకు ముందు హనుమకొండ జిల్లా, కమలాపురం మండలం గూడూరు గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం చేరుకున్న కేటీఆర్ కు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర పోలీస్ కమిషనర్ కె.రంగనాథ్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవలు
కమలాపురం మండల కేంద్రంలో 43.5 కోట్లతో నిర్మించిన మహాత్మ జ్యోతిరావు పూలే బాలికలు,బాలురా విద్యాలయం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలను, కోటి 50 లక్షలతో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కోటి 71 లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, 25 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్, 25 లక్షలతో అయ్యప్ప గుడి, 30 లక్షలతో పెద్దమ్మ గుడి, లక్షలతో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్, 30 లక్షలతో మార్కండేయ ఆలయం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో శంకుస్థాపనలు చేసి  రైతు వేదిక ప్రాంగణంలో 69 లక్షల 85 వేల తో నిర్మించిన వివిధ కుల సంఘాల భవనాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఛైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు, పాడి కౌషిక్ రెడ్డి, ఎమ్మేల్యే లు ఒడితల సతీష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుదీర్ కుమార్, డాక్టర్ తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్,వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ప్రజా ప్రతినిధులు స్థానిక సర్పంచ్ ఎంపీపీ జడ్పిటిసి అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Published at : 31 Jan 2023 06:12 PM (IST) Tags: KTR Telugu News Kamalapuram Hanumakonda Telangana Warangal

సంబంధిత కథనాలు

Warangal BJP: వరంగల్ పశ్చిమ బీజేపీలో టికెట్ కోసం పోటా పోటీ, నేతల వరుస పర్యటనలు

Warangal BJP: వరంగల్ పశ్చిమ బీజేపీలో టికెట్ కోసం పోటా పోటీ, నేతల వరుస పర్యటనలు

Telangana సీఎం కేసీఆర్ సందేశం, BRS ప్రతి కార్యకర్తకు చేరాలి- సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి

Telangana సీఎం కేసీఆర్ సందేశం, BRS ప్రతి కార్యకర్తకు చేరాలి- సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి

TS Police SI Admit Card: ఎస్‌సీటీ ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

TS Police SI Admit Card: ఎస్‌సీటీ ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

TSPSC Paper Leakage: 'గ్రూప్‌-1' పేపర్‌ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్‌ లీకేజీకి స్కెచ్‌!

TSPSC Paper Leakage: 'గ్రూప్‌-1' పేపర్‌ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్‌ లీకేజీకి స్కెచ్‌!

Warangal: రిజిస్ట్రేషన్‌ చెయ్, లేకుంటే పెట్రోల్‌ పోసి తగలబెడతాం! మహిళా తహసీల్దార్‌కు పోలీసుల ముందే బెదిరింపు

Warangal: రిజిస్ట్రేషన్‌ చెయ్, లేకుంటే పెట్రోల్‌ పోసి తగలబెడతాం! మహిళా తహసీల్దార్‌కు పోలీసుల ముందే బెదిరింపు

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా