Warangal News: "నేను వస్తున్నా.. తలుపు తీసి ఉంచు" అంటూ అడ్డంగా బుక్కైన టీచర్- భార్య ప్రియుడ్ని ఊరేగించిన భర్త!
Warangal News: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే దారితప్పారు. వివాహేతర సంబంధం పెట్టుకోగా మహిళ భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఊరేగించాడు. అనంతరం పోలీసులకు అఫ్పగించాడు.
Warangal News: విద్యాబుద్ధులు నేర్పే గురువులే దారి తప్పారు. వివాహేతర సంబంధం నెరుపుతుండగా ఇద్దరు టీచర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ లో ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న కుక్కల నాగేందర్, మరో టీచర్ కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. సదరు ఉపాధ్యాయురాలి భర్త మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అయితే వారి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కానిస్టేబుల్ ఈ తతంగంపై గతంలోనే ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో సదురు ఉపాధ్యాయురాలిని జనవరిలో మంగపేట నుంచి కొత్త బెస్తగూడెం పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపారు. అయినా తీరు మార్చుకోలేదు. ఇద్దరు వివాహేతర సంబంధం కొనసాగించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయురాలి భర్త ఫిబ్రవరి 18వ తేదీన శివరాత్రి రోజు వేములవాడకు బందోబస్తు కోసం వెళ్లి వచ్చారు.
"నేను వస్తున్నా.. తలుపు తీసి ఉంచు"
ఆయనకు సోమవారం సెలవు దినం కావడంతో భార్య, కూతురిని చూసేందుకు మంగపేటకు వచ్చారు. ఈ క్రమంలోనే నాగేందర్ సదరు ఉపాధ్యాయురాలి సెల్ కు ఫోన్ చేయగా.. కానిస్టేబుల్ లిఫ్ట్ చేశారు. అయితే హాలో అనకముందే.. ‘తాను వస్తున్నానని .. తలుపు తీసి ఉంచాలి’ అని చెప్పారు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ భార్యకు విషయం చెప్పకుండా చివరి గదిని లాక్ చేసి.. ముందు తలుపులు తీసి ఉంచి బాత్రూమ్ లో దాక్కున్నాడు. ఉపాధ్యాయుడు రాత్రి ఇంటికి వచ్చి ఉపాధ్యాయుడు లోపలికి వెళ్లగానే బయటి నుంచి తాళం వేశారు. అనంతరం కొత్తగూడ మండలంలోని బంధువులకు, ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. అనంతరం నాగేందర్, టీచర్ కు దేహశుద్ధి చేసి మండల కేంద్రంలో ఊరేగింపుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.