Warangal News: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ- వరంగల్ కమిషనర్ రంగనాథ్
Warangal News: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు కమిషనర్ ఏవీ. రంగనాథ్ తెలిపారు.
Warangal Police Commissioner Ranganath Special activity on prevention of Road accidents in city: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు కమిషనర్ ఏవీ. రంగనాథ్ తెలిపారు. దీనిపై పోలీసులు, ఆర్ అండ్ బీ అధికారులతో చర్చించారు. అలాగే వారితో కలిసి కమిషనరేట్ పరిధిలోని రోడ్లను పరిశీలించారు.
కమలాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల కాలంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనిపై చర్చించేందుకు పోలీసులు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. యాక్సిడెంట్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం కమిషనర్ మాట్లాడారు.
ప్రత్యేక కార్యాచరణ ఇదే..
రోడ్డు ప్రమాదాలను (Road Accidents) అరికట్టేందుకు తాము తీసుకోబోయే చర్యల గురించి కమిషనర్ వివరించారు. 'వాహనాల వేగాన్ని తగ్గించడానికి తగిన సంఖ్యలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తాం. సెంట్రల్ లైటింగ్, సైన్ బోర్డులు, భీంపల్లి క్రాస్ వద్ద డివైడర్లు పెడతాం. ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక ఇంజనీరింగ్ విభాగం ఏర్పాటు చేశాం. వారు ఆయా ప్రాంతాలను పరిశీలించి ప్రమాదాలకు గల కారణాలపై నివేదిక అందజేస్తారు. దాన్ని బట్టి మేం తదుపరి చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగే ప్రాంతాలను గుర్తించి.. వాటి నివారణ దిశగా కృషి చేస్తాం. దీనిపై ఇప్పటికే పోలీసులు, అధికారులకు సూచనలు చేశాం.' అని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, రోడ్డు భవనాల శాఖ ఈఈ గౌస్, కమలాపుర్ ఇన్ స్పెక్టర్ సంజీవ్, ఇంజనీరింగ్ విభాగం ఇన్ స్పెక్టర్ విజయ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నియంత్రణ బాగుంటే అభివృద్ధి సాధ్యమవుతుంది: వరంగల్ సీపీ రంగనాథ్
వరంగల్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ బాగుంటే నగరం అభివృద్ధి సాధించడంతో పాటు, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అధికారులతో కమిషనరేట్ కార్యాలయములో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ట్రిసిటీ పరిధిలో ట్రాఫిక్ సిగ్నల్స్ వాటి పని తీరు, ప్రధాన జంక్షన్లతో పాటు ట్రాఫిక్ సిబ్బంది.. పనితీరుపై ఏసీపీ మధుసూధన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం పోలీస్ కమిషనర్ ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్.. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు, ట్రాఫిక్ అధికారులు నిర్వర్తించాల్సించిన విధుల గురించి పలు సూచనలు చేశారు.
— CP WARANGAL (@cpwrl) December 31, 2022
— Warangal Police (@WarangalPolice) December 22, 2022