News
News
X

Medico Preethi Death News: 2 విషయాల్లో ప్రీతిని టార్గెట్ చేసిన సైఫ్ ! - రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు!

వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న ప్రీతి సీనియర్, డాక్టర్ సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి.

FOLLOW US: 
Share:

Medico Preethi Death News: వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసుకు సంబంధించి యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రీతి సీనియర్, డాక్టర్ సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. సైఫ్ ఫోన్ లో 17 వాట్సాప్ చాట్స్ పోలీసులు పరిశీలించారు. ముఖ్యంగా రెండు విషయాలలో ప్రీతిని డాక్టర్ సైఫ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఓ రోడ్డు ప్రమాదం కేసులో అనస్తీషియా రిపోర్ట్ ప్రీతి రాయడం, మరోవైపు రిజర్వేషన్ కారణంగా ప్రీతి ఫ్రీ సీటు పొందడంపై సైఫ్ ఆమెను టార్గెట్ చేసుకున్నాడని ప్రాథమికంగా గుర్తించారు.

సైఫ్ ఫోన్ పరిశీలించిన పోలీసులు, యాంటీ ర్యాగింగ్ కమిటీ పలు కీలక విషయాలను గుర్తించారు. అనుషా, భార్గవి, LDD+ knockouts వాట్స్ అప్ గ్రూప్ చాట్స్ వివరాలు సేకరించి పరిశీలించారు. అందులో అనస్తీషియా డిపార్ట్మెంట్ లో ప్రీతిని సూపర్వైజ్ చేస్తున్న సీనియర్, డాక్టర్ గా సైఫ్ ఉన్నాడు. రెండు ఘటనల ఆధారంగా ప్రీతిపై సీనియర్ సైఫ్ కోపం పెంచుకున్నాడు.  
డిసెంబర్ లో ఒక యాక్సిడెట్ కేస్ విషయం లో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడు. ఆ ప్రమాదానికి సంబంధించి ప్రిలిమినరీ అనస్తీషియా రిపోర్టును మెడికో ప్రీతి (Medical Student Preethi) రాసింది. ప్రీతి రాసిన రిపోర్టును తమ వాట్సాప్ గ్రూప్ లో పెట్టి హేళన చేశాడు సైఫ్.

టాలెంట్ తక్కువున్నా రిజర్వేషన్ లో ఆమెకు ఫ్రీ సీట్ వచ్చిందంటూ ప్రీతిని అవమానించాడు సైఫ్. తనతో ఏమైనా ప్రాబ్లమా అంటూ సైఫ్ ను ప్రశ్నించింది జూనియర్ డాక్టర్ ప్రీతి. తనతో ఏమైనా సమస్య ఉంటే సంబంధిత డిపార్ట్ మెంట్ హెచ్ఓడీ (HOD) కి చెప్పాలని సైఫ్ కు ప్రీతి సూచించింది. ఈ కారణాలతో ప్రీతిపై మరింత పగ పెంచుకున్న సైఫ్.. జూనియర్ ప్రీతిని వేధించాలని నిర్ణయించుకున్నాడు. ప్రీతిని వేదించాలని తన స్నేహితుడు భార్గవ్ కు సైఫ్ చెప్పాడు. RICU లో రెస్ట్ లేకుండా ప్రీతికి వరుస డ్యూటీ వేయాలని సూచించాడు సైఫ్.

రెగ్యూలర్ గా గొడవలు, అభిప్రాయ బేధాలు వస్తున్న క్రమంలో ఫిబ్రవరి 21న హెచ్ఓడీ నాగార్జునకి ప్రీతి ఫిర్యాదు చేసింది. సైఫ్ తనను టార్గెట్ చేశాడని, తనతో సమస్య ఉంటే నేరుగా హెచ్ఓడీకి ఫిర్యాదు చేయాలని సూచించిన పట్టించుకోకుండా.. గ్రూపులో మెస్సేజ్ లు పెట్టి తన పనిని తప్పుపట్టడం, రిజర్వేషన్ లో ఫ్రీ సీట్ కొట్టావంటూ వేధిస్తున్నాడని సీనియర్ పై ఫిర్యాదు చేసింది. ప్రీతి ఫిర్యాదుపై స్పందించిన డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతికి, సీనియర్ సైఫ్ కు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే ఆ కౌన్సెలింగ్ లో తప్పు ఎవరిదన్నదో తెలియదు కానీ ఆ మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఐదు రోజులపాటు ప్రాణాలతో పోరాడిన ప్రీతి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసింది. అయితే ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్య చేసి డ్రామాలు చేశారని ప్రీతి తల్లిదండ్రులు, సోదరుడు సంచలన ఆరోపణలు చేశారు. 

Published at : 01 Mar 2023 05:34 PM (IST) Tags: Warangal Preethi Preethi Death News Medico Preethi Medico Preethi Death News Saif Remand Report

సంబంధిత కథనాలు

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలు! గ్రూప్-2, 4 పరీక్షలపై సందిగ్ధత!

TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలు! గ్రూప్-2, 4 పరీక్షలపై సందిగ్ధత!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్