Warangal: కేఎంసీలో కరోనా విజృంభణ.. ఏకంగా 20 మంది మెడికోలకు పాజిటివ్
వరంగల్ ఎన్ఐటీ క్యాంపస్‌లోకి కరోనా మహమ్మారి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 16 మంది ఎన్ఐటీ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.
వరంగల్ కేఎంసీలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 20 మంది మెడికోలకు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. 195 మంది విద్యార్థులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో 20 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిపుణులు నిర్థారించారు. ఈ మేరకు కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ వెల్లడించారు. 20 మంది విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అంతేకాక, వరంగల్ నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో కూడా ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు సమాచారం! దీంతో వరంగల్ వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
వరంగల్ ఎన్ఐటీ క్యాంపస్‌లోకి కరోనా మహమ్మారి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 16 మంది ఎన్ఐటీ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. క్రిస్మస్ పండగ సందర్భంగా ఎన్ఐటీ విద్యార్థులు కొందరు ఇళ్లకు వెళ్లివచ్చారు. అయితే వీరిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో క్యాంపస్ అధికారులు అనుమానంతో టెస్టులు చేయించగా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో క్యాంపస్‌లోని మిగతా స్టూడెంట్స్‌కు కూడా కరోనా టెస్టులు చేశారు. దీంతో మొత్తం 16 మందికి పాజిటివ్ అని తేలింది.
ఇలా క్యాంపస్ లో భారీగా కరోనా కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన అధికారులు ఈ నెల 16 వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే కరోనా నిర్దారణ అయిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఎన్ఐటీ డైరెక్టర్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, అందరు విద్యార్థులు ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన భరోసా ఇచ్చారు.
ఓయూ హాస్టళ్ల బంద్
ఉస్మానియూ యూనివర్సిటీలోని హాస్టళ్లను శనివారం నుంచి ఈ నెల 16 వరకు మూసివేస్తున్నట్లు వీసీ ప్రకటించారు. ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిందని.. ఆ ఆదేశాల మేరకు విద్యార్థులంతా హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని తెలిపారు. విద్యార్థులు వెళ్లకపోవడంతో విద్యుత్తు, మంచినీటి సరఫరా నిలిపివేశారు.
Also Read: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్.. స్వల్ప లక్షణాలతో హోం క్వారంటైన్
Also Read: Corona Cases: ఢిల్లీ, ముంబయిలోనే 40 వేలకు పైగా కరోనా కేసులు.. బెంగాల్‌లోనూ పరిస్థితి