Warangal: వంట జాబ్ కోసం UP నుంచి వరంగల్‌కు, వచ్చాక మారిన బుద్ధి - రాత్రివేళ పాడు పని!
వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. యూపీ వ్యక్తి వంట పని కోసం వచ్చి దొంగతనం మొదలుపెట్టాడు
Warangal Theft Incident: వంట పని (Cooking Job) కోసం వచ్చి చోరీకి పాల్పడిన ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రానికి చెందిన దొంగను హన్మకొండ సీసీఎస్ పోలీసులు (Hanamkonda CCS Police) అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి పోలీసులు రూ.2.5 లక్షల విలువ గల ఒక ఖరీదైన ద్విచక్ర వాహనం, ఒక ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడి వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్ జోషి (CP Tarun Joshi)
ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి (Warangal CP Tarun Joshi) వివరాలను వెల్లడించారు. ‘‘నిందితుడు షేక్ ఫయాజ్ (23), గాజీపూర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన వాడు. నిందితుడు గత పది రోజుల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్ (Hyderabad News) కు వచ్చి నివాసం ఉంటున్నాడు. హన్మకొండకు (Hanamkonda News) చెందిన హోటల్ నిర్వహకుడికి నిందితుడు వాట్సప్ గ్రూప్ ద్వారా పరిచయం అయ్యాడు. తాను నిర్వహిస్తున్న హోటల్ వంట మనిషిగా పనిచేయాల్సిందిగా హోటల్ యజమాని నిందితుడికి చెప్పడంతో నిందితుడు గత అక్టోబర్ 23వ తేదీన హన్మకొండకు (Hanamkonda News) చేరుకున్నాడు.
హోటల్ యజమాని సూచన మేరకు హన్మకొండ బస్టాండ్ (Hanamkonda Bus Stop) సమీపంలోని కిరాయిలో గదిలో నిందితుడు ఉన్నాడు. అదే గదిలో హోటల్లో పనిచేసే మరో ఇద్దరు ఉన్నారు. వీరి వద్ద ఒక ఖరీదైన ద్విచక్రవాహనంతో పాటు ల్యాప్ టాప్ ఉండదాన్ని నిందితుడు గమనించాడు. నిందితుడు అదే రోజు రాత్రి హోటల్ యజమాని కిరాయి గదిలో మిగతా వ్యక్తులతో కలిసి క్రికెట్ మ్యాచ్ వీక్షించాడు. అనంతరం గదిలో మిగతా ఇద్దరు వ్యక్తులు నిద్రపోవడంతో నిందితుడు సదరు వ్యక్తులకు చెందిన ఖరీదైన ద్విచక్ర వాహనంతో పాటు ల్యాప్ టాప్ ను చోరీ చేశాడు. వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
నిందితుడిపై నిఘా, ల్యాప్ టాప్ అమ్ముతుండగా పట్టుకున్న పోలీసులు
రాత్రి వేళ జరిగిన దొంగతనంపై బాధితులైన యువకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడుని పట్టుకొనేందుకు విచారణ చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులు నేడు (నవంబరు 22) ఉదయం హన్మకొండ (Hanamkonda News) ప్రాంతంలో చోరీ చేసిన ల్యాప్ టాప్ అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించారు. అలా నిందితుడుని అదుపులోకి తీసుకోని విచారణ చేశారు. తాను పాల్పడిన నేరాన్ని పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు.
నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్ అండ్ ఆపరేషన్స్ అదనపు డీసీపీ పుష్పారెడ్డి, క్రైమ్స్ ఏసీపీ డేవిడ్ రాజు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాస్ రావు, హన్మకొండ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏఏఓ సల్మాన్ పాషా, సీసీఎస్ ఎస్.ఐలు సంపత్ కుమార్, బాపురావు, ఏఎస్ఐ తిరుపతి, హెడ్ కానిస్టేబుళ్లు మహ్మద్ అలీ, వేణుగోపాల్, షర్పూద్దీన్, కానిస్టేబుల్ నజీరుద్దీన్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.