Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు - భూసేకరణపై మంత్రుల దృష్టి
Telangana: వరంగల్ ఎయిర్ పోర్ట్ కోసం భూసేకరణ పనులను ప్రభుత్వం ప్రారంభించింది. వీలైనంత త్వరగా ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.
Telangana Government has started land acquisition works for Warangal Airport: తెలంగాణ రాష్ట్రంలో రెండవ రాజధానికి ఉన్న వరంగల్ లో దశాబ్దాల కాలంగా విమాన ప్రయాణికులను వరంగల్ ఎయిర్ పోర్ట్ ఊరిస్తూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మామునూరు ఎయిర్ పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రారంభోత్సవం జరగడం లేదు. మరో సారి మామునూరు ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం తెరపైకి వచ్చింది. ఎయిర్ పోర్ట్ కు కావల్సిన భూమికి కోసం రైతులతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశం నిర్వహించారు.
భూములను కోల్పోతున్న రైతులతో సమావేశం.
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని మామునూరు ఎయిర్ పోర్ట్ ను జిల్లా మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో ఎంపి కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, అధికారులు ఎయిర్ పోర్ట్ ను సందర్శించారు. అధికారులతో ఎయిర్ పోర్ట్ కు కావాల్సిన ల్యాండ్ పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం, భూసేకరణ లో భాగంగా నక్కలపల్లి, గుంటూరు పల్లి, గాడిపల్లి గ్రామాల పరిధిలో భూములు కోల్పోయే రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భూములు కోల్పోతున్న రైతుల నుంచి ప్రజాప్రతినిధులు వారి అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలుసుకోవడం జరిగింది. రైతులకు
తగిన నష్టపరిహారం చెల్లించి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి సురేఖ హామీ ఇచ్చారు. రైతుల విజ్ఞప్తులను పరిశీలించి అమలు చేస్తామన్నారు. మామునూర్ ఎయిర్ పోర్ట్ కు పునర్వైభవం తీసుకు రావడం కోసం, ఎయిర్ పోర్ట్ ని తిరిగి ప్రారంభించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవునట్లుగా మంత్రి, ఎమ్మెల్యేలు చెప్పారు. జీఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వరంగల్ విమానాశ్రయం నిర్మాణానికి అంగీకరించిందని పేర్కొన్నారు. భూసేకరణం అనంతరం పనులు వేగవంతమవుతాయాని స్పష్టం చేశారు.
ఎయిర్ పోర్ట్ కు కావాల్సిన భూమి గుర్తింపు !
వరంగల్ నగరంలోని మామునూర్ విమానాశ్రయానికి చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంది. అయితే ఎయిర్ పోర్ట్ పునరుద్ధరణకు సుమారు 950 ఎకరాల భూమి అవసరమని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అవసరమని సూచించారు. 254 ఎకరాల భూమి అవసరం ఉంది. ఇందుకోసం గత ప్రభుత్వం భూసేకరణ, మౌలిక వసతుల కోసం 2023-2024 బడ్జెట్ లో 73 కోట్లను కేటాయించింది. కానీ నిధులు మంజూరు కాలేదు. భూసేకరణ జరగలేదు. దీంతో ఎయిర్ పోర్ట్ పునరుద్ధరణకు బ్రేక్ పడింది. ఎయిర్ పోర్ట్ ప్రారంభం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖంగా ఉండడంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశమయ్యారు.
విమానాశ్రయం ఆకాంక్ష నెరవేరేనా...!
మామునూర్ ఎయిర్ పోర్ట్ ప్రారంభానికి గత ప్రభుత్వాలు ఎయిర్ పోర్ట్ సందర్శించడం, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో సమావేశం కావడం తో సర్వే చేయడం జరిగింది. కల నెరవేరలేదు. ఈ ప్రభుత్వం హాయాంలో నైనా మామనూర్ ఎయిర్ పోర్ట్ ప్రారంభమవుతుంది వేచిచూడాలి.