News
News
వీడియోలు ఆటలు
X

Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 
Share:

వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో జరిగే ఆత్మీయ సమావేశాలకు ఎమ్మెల్యే రాజయ్య తనకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద సమావేశాలకు, సభలకు తనను వాడుకుంటున్నారని.. ప్రభుత్వపరంగా కార్యక్రమాలకు, సమావేశాలకు తనను పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎన్నికల అప్పుడు ఎమ్మెల్యే రాజయ్య తనకు సహాయం చేయమని అడగడంతో, పార్టీ నిర్ణయానికి కట్టుబడి సొంత డబ్బులు ఖర్చు పెట్టి పని చేశానని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఒక్క రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా పనిచేశానని అన్నారు. స్వయంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. మీరు ఒక్కరే డబ్బులు తీసుకోకుండా పని చేశారని కొనియాడారని కడియం చెప్పారు. 

స్టేషన్ ఘన్ పూర్ లో జరిగే ఆత్మీయ సమావేశాలకు తనకు ఆహ్వానం ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను ఎమ్మెల్యే రాజయ్య బేఖాతర్ చేశారని మండిపడ్డారు. నాకు అవకాశం ఉన్నప్పుడు కూడా నిజాయతీగా పని చేశానని అన్నారు. మొన్నటికి మొన్న సోడాషపల్లి కేటీఆర్ బహిరంగ సభలో కడియం శ్రీహరి అంటే ఏమిటో అందరికీ అర్థమైంది అని అన్నారు. ఇప్పటికైనా ఆత్మీయ సమావేశాలకు సమాచారం లేకపోతే పార్టీలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడే ఉంటానని అన్నారు.

Published at : 02 Apr 2023 02:15 PM (IST) Tags: BRS News tatikonda rajaiah Station Ghanpur Kadiam srihari Station Ghanpur Politics

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

Father Colombo Medical College: ఫాదర్ కొలంబో కల ఇప్పటికి నెరవేరింది, మూడు మెడికల్‌ కాలేజీల నగరంగా వరంగల్‌: మంత్రి హరీష్

Father Colombo Medical College: ఫాదర్ కొలంబో కల ఇప్పటికి నెరవేరింది, మూడు మెడికల్‌ కాలేజీల నగరంగా వరంగల్‌: మంత్రి హరీష్

RTO Vehicle Registration: రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, సర్వర్ డౌనే కారణం

RTO Vehicle Registration: రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, సర్వర్ డౌనే కారణం

టాప్ స్టోరీస్

AP Flexi War : ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు - వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

AP Flexi War :  ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు -  వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు