News
News
X

Mulugu District News: బ్యాంక్ లోన్ చెల్లించలేదని రైతు భూమిలో ఎర్ర జెండాలు!

Mulugu District News: మూడేళ్ల క్రితం బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించలేదని.. డీసీసీ బ్యాంకు అధికారులు సదరు అన్నదాత పొలంలో ఎర్రజెండాలు పాతారు. గడువులోగా అప్పు చెల్లించకపోతే భూమిని వేలం వేస్తామన్నారు.

FOLLOW US: 
 
Mulugu District News: దున్నేవాడిదే భూమి అని భూస్వాముల భూముల్లో నక్సలైట్లు ఎర్ర జెండాలు పాతడం చూశాం. సర్కార్ స్థలాల్లో లెఫ్ట్ పార్టీల లీడర్లు ఎర్ర జెండాలు నాటడం చూశాం. ఆ భూమికోసం తిరుగుబాటు చేయడం చూశాం. నాటి దృశ్యాలు తలపించేలా రైతుల భూముల్లో బ్యాంక్​ అధికారులు ఎర్ర జెండాలు పాతారు. అదేదో ఆ రైతులకు సాయం చేయాలని కాదండోయ్.. అప్పు చెల్లించలేదని వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకుంటాం అంటూ హెచ్చరించడానికి. ఎక్కడైనా బ్యాంకు రుణం చెల్లించకుంటే లీగల్ నోటీసులు పంపుతారు లేదా కేసులు పెడతారు. లేదా ఆస్తులు జప్తు చేస్తారు.. గతంలో అయితే ఇళ్లకు ఉన్న తలుపులను తీసుకెళ్లే వాళ్లని కూడా విన్నాం. కానీ ములుగు జిల్లాలో డీసీసీ బ్యాంక్ అధికారులు రైతు పొలంలో ఎర్ర జెండాలు నాటారు.

అసలే ములుగు జిల్లా అంటే ఏజెన్సీ ప్రాంతం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం.. ఇలాంటి ప్రాంతంలో అధికారులు ఎర్ర జెండాలు పాతడం పట్ల పలు విమర్శలకు తావిస్తోంది. ఒక రైతు బ్యాంకు లోన్ కట్టలేదని భూమిలో బ్యాంక్ అధికారులు ఎర్రజెండాలు పాతిన సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.

బ్యాంక్ రుణం ఎంత పాపం

News Reels

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ఎద్దు రాజ్ కుమార్ అనే రైతు తన 2 ఎకరాల 39 గంటల భూమిని కుదువ పెట్టి 3 సంవత్సరాల క్రితం డీసీసీ బ్యాంకు నుండి 5 లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నాడు. లోన్ కట్టాలని బ్యాంక్ అధికారులు పలుమార్లు లీగల్ నోటీసులు పంపించారు. కానీ తనకు వీలుకాక అప్పు కట్టలేకపోయాడు. దీంతో రైతు రాజ్ కుమార్ తో ఎలాగైనా సరే లోన్ కట్టించాలనుకున్న బ్యాంకు అధికారులు రైతు పొలం వద్దకు ఎర్రజెండాలు తీసుకెళ్లి పాతారు. డిసెంబర్ 6వ తేదీ వరకు గడువు ఇస్తున్నామని, లోన్ కట్టకపోతే భూమిని వేలం వేస్తామని బ్యాంకు అధికారులు హెచ్చరించారు. తరువాత రైతు జెండాలను పొలం నుండి తొలగించారు.

ఆదేశాలు బేఖాతర్..

రిజర్వ్​ బ్యాంకు ఆదేశాల ప్రకారం బ్యాంకులు తమ వ్యాపార ధనంలో 40% వ్యవసాయ రుణాలు ఇవ్వాలి. ఇందులో 18% పంట రుణాలు, 22% దీర్ఘకాలిక రుణాలుగా ఇవ్వాలి. ఈ వ్యవసాయ రుణ మొత్తంలో 15% దళితులు, గిరిజనులకు విధిగా ఇవ్వాలి. పాలక వర్గాలు వ్యవసాయ రుణాలకు అంకెలు ప్రకటించి రైతులకు ఎగనామం వేస్తున్నాయి. బడా కంపెనీలకు పెద్దపీట వేసి రైతుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రైతే రాజు అంటూ ప్రభుత్వాలు పలు రకాల పథకాలు తీసుకొస్తున్నా... కొందరు రైతులు మాత్రం అప్పుల పాలై అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరానికి అప్పు తీసుకున్న అన్నదాతలు.. రుణం చెల్లించకోపోతే అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం, సదరు బ్యాంకు అధికారులు అతడి పొలంలో జెండాలు పాతడం బాధాకరం. ఇప్పటికీ రైతుల పట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ప్రభుత్వ వైఫల్యానికి కారణం అనే చెప్పొచ్చు. 

Published at : 09 Nov 2022 02:52 PM (IST) Tags: mulugu news Mulugu District News Mulugu Farmer DCC Bank Officers Red Flags on Farmers Land

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

TS News Developments Today: నేడు సిబిఐ అధికారులు ఏం చేయబొతున్నారు? కవితను విచారిస్తారా? 

TS News Developments Today: నేడు సిబిఐ అధికారులు ఏం చేయబొతున్నారు? కవితను విచారిస్తారా? 

Weather Latest Update: ఏపీకి తుపాను హెచ్చరిక- ఈనెల 8 నుంచి వర్షాలు!

Weather Latest Update: ఏపీకి తుపాను హెచ్చరిక-  ఈనెల 8 నుంచి వర్షాలు!

Revanth Reddy on TRS: కవిత అనుమతి తీసుకొని సీబీఐ విచారిస్తోంది! టీఆరెస్, బీజేపీ వార్ వీధి నాటకమన్న రేవంత్

Revanth Reddy on TRS: కవిత అనుమతి తీసుకొని సీబీఐ విచారిస్తోంది! టీఆరెస్, బీజేపీ వార్ వీధి నాటకమన్న రేవంత్

TS News Developments Today: తెలంగాణలో టాప్‌ న్యూస్ డెవలప్‌మెంట్‌ న్యూస్‌ ఇదే!

TS News Developments Today: తెలంగాణలో టాప్‌ న్యూస్ డెవలప్‌మెంట్‌ న్యూస్‌ ఇదే!

టాప్ స్టోరీస్

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్