News
News
X

Mulugu SI Conspiracy: కానిస్టేబుల్‌‌ మర్డర్‌కు ఎస్సై ప్లాన్! ఇంకో భారీ కుట్ర - ఒకే దెబ్బకు రెండు పిట్టలు?

సాయుధ దళం ఏర్పాటు చేసి ఆ సభ్యులతో కొన్ని కార్యకలాపాలు సాగించి, తిరిగి వారిని ఎన్‌కౌంటర్‌ పేరిట హతమార్చి పోలీస్‌ శాఖలోనూ పేరు తెచ్చుకోవాలని ఎస్సై కుట్ర పన్నారని తెలుస్తోంది

FOLLOW US: 
Share:

Mulugu SI Conspiracy News: ఊరుకు ఒక్కడే రౌడీ ఉండాలి అది పోలీసుసోడు అయ్యి ఉండాలి.. ఇది ఒక సినిమాలో డైలాగ్. ఆ సినిమా డైలాగ్ ను నిజం చేస్తున్నారు కొంత మంది పోలీసులు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ముందుకు వెళ్తుంటే ఈ పోలీసుల తీరు చూస్తుంటే ఖాకీ వనంలో కలుపు మొక్కలుగా తయారైయ్యారనే అనిపిస్తుంది. ఇటీవల ఓ కేసులో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ల లొల్లి విషయం బయటికి వచ్చింది. హద్దు మీరిన ఓ ఇన్‌స్పెక్టర్, మహిళా ఎస్సై‌ వ్యవహారం కూడా బయటికి వచ్చింది. తాజాగా ఓ ఎస్సై కానిస్టేబుల్‌ను అంతమొందించేందుకు చేసిన దిమ్మతిరిగే వ్యవహారం బయటికి వచ్చింది.

ములుగు జిల్లాలో (Mulugu District) ఓ కానిస్టేబుల్ తన కెరీర్ మెరుగు కోసం వేసిన భారీ కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. ఇంటెలిజెన్స్ వర్గాలు దీన్ని పసిగట్టడంతో మొత్తం స్కెచ్ భగ్నం అయింది. ఓ వైపు మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, వారితోనే తన ఎదుగుదలకు బాటగా మార్చుకొనేందుకు ప్రణాళికలు వేశాడు. ఆ క్రమంలో భాగంగా ఓ హెడ్ కానిస్టేబుల్‌ను చంపించేందుకు కూడా వెనుకాడలేదు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై మావోయిస్టుల మాదిరిగా ఓ దళాన్ని ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నారని వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లాలోని తాడ్వాయి అడవుల్లో అందుకు సంబంధించి ట్రయల్స్ కూడా చేశారని సమాచారం. వారి కదలికల ద్వారా మావోలు ఉన్నారని భద్ర కల్పించి, వారు హెడ్‌ కానిస్టేబుల్‌ను కాల్చి చంపించారని నమ్మించాలని స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ములుగు జిల్లాలో పనిచేసే ఓ ఏఆర్‌ ఎస్‌ఐ పకడ్బందీగా జరిపిన ఈ కుట్ర కోణాన్ని హైదరాబాద్‌లోని పోలీస్‌ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధారాలతో కూడిన కొన్ని వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ములుగు పోలీసుల సహకారంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్ కూడా రంగంలోకి దిగింది. సదరు ఏఆర్‌ ఎస్‌ఐతో పాటు మరో ఇద్దరిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ చేస్తున్నట్లుగా తెలిసింది. 

ఈ కుట్రకోణం వెనుక భారీ ప్రణాళిక దాగి ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. సాయుధ దళం ఏర్పాటు చేసి ఆ సభ్యులతో కొన్ని కార్యకలాపాలు సాగించి, తిరిగి వారిని ఎన్‌కౌంటర్‌ పేరిట హతమార్చి పోలీస్‌ శాఖలోనూ పేరు తెచ్చుకోవాలని ఎస్సై కుట్ర పన్నారని తెలుస్తోంది. మరో కోణం దాగి ఉన్నట్లు కూడా ప్రచారంలో ఉంది. వరంగల్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ను కాల్చి చంపే యాక్షన్‌ టీమ్‌ తనను కలిసేందుకు ములుగు ప్రాంతానికి వచ్చే క్రమంలో ఎన్‌కౌంటర్‌ చేయాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. హెడ్‌ కానిస్టేబుల్‌ను కాల్చి చంపి మావోలు ఉన్నట్లు భ్రమ కల్పించడంతోపాట, వారిని ఎన్ కౌంటర్ చేసి పోలీసు అధికారుల మెప్పు పొంది ప్రమోషన్లు పొందాలని కుట్ర పన్నినట్లు తెలిసింది.ముందే ఈ వివరాలన్నీ నిఘా విభాగం గుర్తించడంతో వీటన్నింటిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

Published at : 05 Jan 2023 09:14 AM (IST) Tags: Mulugu news Mulugu conspiracy AR SI plan maoists in Mulugu

సంబంధిత కథనాలు

KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్

KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్

Telangana CS Shanti Kumari: కంటి వెలుగు, పోడు పట్టాలు, టీచర్ల బదిలీలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష

Telangana CS Shanti Kumari: కంటి వెలుగు, పోడు పట్టాలు, టీచర్ల బదిలీలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష

Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం

Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం

Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

KTR: ఈ 31న రూ.49 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

KTR: ఈ 31న రూ.49 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

టాప్ స్టోరీస్

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి