Seethakka: టీచర్‌గా మారిన సీతక్క, అంగన్వాడీ పిల్లలకు ఏబీసీడీలు
Mulugu News: జగ్గన్న పేట గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడల్ అంగన్ వాడీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
Seethakka News: మంత్రి సీతక్క టీచర్ గా మారారు. ఇదేంటీ అనుకుంటున్నారా..? అవును విద్యార్థులకు అక్షరాలు నేర్పించారు. ములుగు మండలంలోని జగ్గన్న పేట గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడల్ అంగన్ వాడీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క అంగన్ వాడి సెంటర్ లో ఏబీసీడీలు చెప్పడంతోపాటు వారికి నేర్పించారు. అంతేకాకుండా అంగన్ వాడి సెంటర్ కు వచ్చిన శిశువులను ఎత్తుకొని లాలించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్ఠికాహారం అందించడంతో పాటు మొదటి అక్షరాభ్యాసం ఇక్కడి నుంచే మొదలు అవుతుందని మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఐసీడీఎస్ అధికారి, అంగన్వాడీ టీచర్ లు ఉన్నారు.
అంతకుముందు మేడారం జాతర వద్ద ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. మేడారం జాతర పనులపై రివ్యూ సమావేశం కూడా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇక రివ్యూ మీటింగ్ లు ఉండవని ఇదే ఆఖరి మీటింగ్ అని అన్నారు. పనుల విషయంలో ఎవర్ని ఊరుకునేది లేదని అన్నారు. జరగబోయే మండమేలిగే పండగతో జాతర మొదలు కానున్నట్టు మంత్రి సీతక్క వెల్లడించారు. రోడ్ల దగ్గర దుమ్ము ఉందని.. ఆ ఇబ్బంది అవుతుందని మంత్రి తెలిపారు. జాతర మొదలయ్యేలోగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 24 2024 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.