Medaram Jatara: మేడారం జాతరకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం, జాతర పోస్టర్ ఆవిష్కరణ
Revanth Reddy Unveils Medaram Jatara Poster: మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి కి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా మేడారం జాతర పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
Medaram Jatara Poster Unveils: హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం మహా జాతర (Sammakka Saralamma Jatara) పోస్టర్ ను ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం నాడు మేడారంలోని సమ్మక్క సారలమ్మ పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆవిష్కరించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 23న మేడారం జాతర (Medaram Jatara)కు వెళ్లి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి మేడారం పూజారుల సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు.
డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో #మేడారం మహా జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు, మంత్రులు సీతక్క గారు, శ్రీమతి కొండా సురేఖ, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, అధికారులు. pic.twitter.com/DmxhrthhBF
— Telangana CMO (@TelanganaCMO) January 27, 2024
మేడారం జాతరకు రావాలని సీఎం రేవంత్ కు ఆహ్వానం
ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ (Sammakka Saralamma Jatara) మేడారం జాతరకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి కి ఆహ్వానం అందింది. మేడారం ఆలయ పూజారుల సంఘం సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను సచివాలయంలో శనివారం అందజేసింది. వచ్చే నెలలో జరుగనున్న మేడారం జాతర ఏర్పాట్లు, సంబంధిత పనులపై దేవాదాయశాఖ అధికారులు సీఎం రేవంత్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రులు సీతక్క, పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ సమక్షంలో మేడారం జాతర పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.