![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
మహబూబాబాద్ లోక్‌సభకు త్రిముఖ పోటీ- రేసులో నెగ్గేదెవరు, తగ్గేదెవరో !
Telangana News: మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, బలరాం నాయక్ లు అధృష్టనాన్ని పరీక్షించుకుంటున్నారు.
![మహబూబాబాద్ లోక్‌సభకు త్రిముఖ పోటీ- రేసులో నెగ్గేదెవరు, తగ్గేదెవరో ! Mahabubabad lok sabha Constituency MP Candidates Maloth Kavitha Balaram Naik and Sitaram Naik మహబూబాబాద్ లోక్‌సభకు త్రిముఖ పోటీ- రేసులో నెగ్గేదెవరు, తగ్గేదెవరో !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/f9b3d8c2803411835ea40b3c21daf7551711454634598233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mahabubabad lok sabha Constituency MP Candidates: మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో పోటీ చేస్తున్న వారంతా ఎంపీలుగా పనిచేసిన వారే. వీరంతా మరోసారి అదృష్టాన్ని పరిక్షించుబోతున్నారు. ఆ పార్లమెంట్ నియోజకవర్గమే మహబూబాబాద్. మూడు ప్రధాన పార్టీ నుండి పోటీ చేసేవారు ఎంపీలుగా చేయడంతోపాటు ముగ్గురు ఒకే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు కావడంతో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది.
ఒకే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు
మహబూబాబాద్ నియోజకవర్గంలో ముగ్గురి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ నియోజక వర్గంలో ఆదివాసి గిరిజనులు, లంబాడీ గిరిజన ఓట్లు ఎక్కువ. అంతేకాకుండా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకొని ఉంది. ఇన్ని ప్రాధాన్యతలు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్ని ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించిన వారిని రంగంలోకి దింపాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా, మంత్రిగా పనిచేసిన బలరాం నాయక్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, బీజీపీ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ లు బరిలో ఉన్నారు. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. వీరంతా గతంలో ప్రజలకు హామీల మీద హామీలు ఇచ్చిన వారే. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, లంబాడీల 12 శాతం రిజ్వేషన్లు, పోడు భూములకు పట్టాలు ఇలా అనేక హామీలు ఇచ్చారు. ఇవ్వని నెరవేరాయా... పాత హామీలతో ప్రజల్లోకి వెళ్తారా అనేది ప్రచారం మొదలుపెడితే తెలియనుంది.
నర్సంపేట తప్ప మిగతావి ఎస్టీ స్థానాలే
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లంద, భద్రాచలం అసెంబ్లీ నియోజకర్గాలు వస్తాయి. ఇందులో నర్సంపేట తప్ప మిగితా ఆరు నియోజకవర్గాలు ఎస్టీ స్థానాలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం మినహా ఆరు స్థానాలలో కైవసం చేసుకుంది. గెలుపే ఎవరి ధీమా వారే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆరుగురు ఎమ్మేల్యే లు కాంగ్రెస్ వారే కాబట్టి గెలుపు పై దీమాతో ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అరు గ్యారెంటీలు విజయానికి బాటలు వేస్తాయనుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ విజయం తమదే అనే భావనలో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు అయిన నాటి నుండి మహబూబాబాద్ పార్లమెంట్ ప్రజలు రెండు సార్లు గెలిపించారని మూడవసారి సైతం గెలిపిస్తరని, 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు కలిసివస్తాయనే దీమాలో ఉన్నారు. కాంగ్రెస్, బీ అర్ ఎస్ పార్టీ లను పక్కన పెట్టి ఈ సారి బీజేపీ కు పట్టంకడతారని, అసెంబ్లీ ఎన్నికలకు , పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ని కోరుకుంటున్నారని కాషాయం పార్టీ భావిస్తోంది. ఇలా తమ బలాబలాలను బేరీజు వేసుకుని గెలుపుకోసం వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు మూడు పార్టీ అభ్యర్థులు.
తెలంగాణ వచ్చాక పెరిగిన పోటీ
అత్యధికంగా ఎస్టీ ఓటర్లు ఉన్న పార్లమెంట్ స్థానం మహబూబాబాద్. ఎస్టీల్లో ఆదివాసి గిరిజనులు, లంబాడీ గిరిజనులు ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థానానికి పోటీ పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీతారామ్ నాయక్ మొదటి ఎంపీగా గెలుపొందగా, మాలోత్ కవిత గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ప్రస్తుతం సిట్టింగ్‌గా ఉన్నారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అనూహ్యంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 14 లక్షల 28 వేల ఓట్లు ఉన్నాయి.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌పై బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత సుమారు 1 లక్ష 46 మెజారిటీ గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3 లక్షల 15 వేల 445 ఓట్లు సాధించి రెండవ స్థానం లో నిలిచ్చారు. 25వేల 487 ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి హుస్సేన్ నాయక్ ఐదవ స్థానంలోకి వెళ్లారు.
రాష్ట్రంలో అధికారం లో ఉన్నామన్న ధీమాతో కాంగ్రెస్ ఉంది. అధికారాన్ని కోల్పోయిన 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత తోడు గులాబీ పార్టీ ఓటు బ్యాంక్ కలిసి వస్తుందనీ బీఆర్ఎస్ ఆలోచనలో ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ప్రజలు విగిపోవడంతో పాటు కేంద్రంలో ప్రజలు మోడీని కోరుకుంటున్నారని బీజేపీ ఆశాభావంలో ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)