అన్వేషించండి

Warangal Politics: చిరకాల ప్రత్యర్థుల మధ్య మళ్లీ డైలాగ్ వార్! ఇద్దరూ తగ్గట్లేదుగా!

Telangana News: కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 25 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి చేరింది.

Station Ghanpur News: చిరకాల రాజకీయ ప్రత్యర్థుల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. రెండు దశాబ్దాలకు పైగా ఓకే నియోజకవర్గంలో శత్రువులుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వారే ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన ఇద్దరు మాజీ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య. పార్లమెంటు ఎన్నికల వేల ఇద్దరు మాజీ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య లు విమర్శల దాడి మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచార వేదికలపై ఒకరిపై ఒకరు మాటల దాడులకు దిగుతున్నారు. కబడ్డీ ఆడుతా అని రాజయ్య అంటే... దళిత బంధులో అవినీతి పరుడివి నీ అంతూ చూస్తానంటూ కడియం అంటున్నారు.

ప్రత్యర్థులుగా ఒకే నియోజకవర్గం.

కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య లు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 25 సంవత్సరాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతూ వస్తున్నారు. ఇద్దరి నేతలు స్టేషన్ ఘన్ పూర్ నుండే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కడియం శ్రీహరి టిడిపి నుండి ప్రారంభించగా. తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీ నుండి తన రాజకీయాన్ని ప్రారంభించారు. ఇద్దరిది ఒకటే నియోజకవర్గం కావడంతో రాజకీయ ప్రత్యర్థులుగా మారుతూ వచ్చారు. అయితే ఇద్దరు 2010 వరకు వేరు వేరు పార్టీల్లో ఉన్న శ్రీహరి, రాజయ్య లు రాజకీయ విమర్శల వరకే పరిమితమయ్యారు.

ఒకే ఒరలో రెండు కత్తులు..

కడియం శ్రీహరి చేతిలో పరాజయం పాలవుతూ వచ్చిన తాటికొండ రాజయ్య మొట్టమొదటిసారిగా 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా స్టేషన్ ఘన్పూర్ నుండి విజయం సాధించారు. 2011లో తెలంగాణ ఉద్యమం, అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజయ్య  కాంగ్రెస్ ను వీడి టీ ఆర్ ఎస్ లో చేరారు. కొద్ది రోజులకే తెలంగాణ లో టీడిపి తుడిచి పెట్టుకుపోవడంతో కడియం శ్రీహరి సైతం అప్పటి టీ అర్ ఎస్ లో చేరారు. దీంతో ఇద్దరు ప్రత్యర్థులు ఒకే పార్టీ నేతలు అయ్యారు.

ఇద్దరూ ఉపముఖ్యమంత్రులు అయ్యారు.

తాటికొండ రాజయ్య 2009, 2012 ఉపఎన్నిక, 2014 2018 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 లో రాజయ్య తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఏడాది లోగా రాజయ్యను పదవి నుండి తప్పించి కడియం ను ఉపముఖ్యమంత్రి చేయడంతో అప్పటి నుండి ఇద్దరి మధ్య మళ్లీ వార్ మొదలైంది. నివురు గప్పిన నిప్పులా కోపం ఉన్న అధినేత కేసీఆర్ భయంతో విమర్శలు చేసుకోకపోయిన ఎడముఖం... పెడముఖం లా ఉంటూ వచ్చారు ఇద్దరు నేతలు. 

2024 ఎన్నికలతో మళ్ళీ వార్..

2024 సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ అధినేత తాటికొండ రాజయ్యను కాదని కడియం శ్రీహరికి స్టేషన్గన్పూర్ టికెట్ కేటాయించారు దీంతో ఇద్దరి మధ్య మళ్లీ వార్ మొదలైంది ఉపముఖ్యమంత్రి పోవడానికి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కడియం శ్రీహరి కారణమని రాజయ్య మాటల దాడి చేశారు నా దాడి కాస్త వ్యక్తిగత విమర్శలు వరకు వెళ్లి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పార్టీకి నష్టం జరుగుతుందని కేసీఆర్ ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చి రాజయ్య కు ఎంపీ టిక్కెట్ హామీ ఇచ్చారు. బీ అర్ ఎస్ అధికారాన్ని కోల్పోవడం, ఎంపీ టిక్కెట్ రాదని భావించిన రాజయ్య రెండు నెలల క్రితం బీ ఆర్ ఎస్ ను వీడారు. కొద్దిరోజుల క్రితం కడియం శ్రీహరి సైతం బీ ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. 

రాజయ్య రీ ఎంట్రీతో మాటల దాడి

కే సీ ఆర్ రాజయ్య ను పార్టీ లోకి ఆహ్వానించడం తిరిగి పార్టీలో చేరి నియోజకవర్గానికి వచ్చిన రాజయ్య ప్రత్యర్ధి కడియం పై విమర్శలు మొదలు పెట్టారు. బ్లాక్ మెయిల్, వెన్నుపోటు రాజకీయాల్లో కడియం శ్రీహరి దిట్ట అని రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీఆర్, కేసీఆర్ లకు మోసం చేశారని రాజయ్య విమర్శించారు. నిన్నటికి నిన్న కబడ్డీ ఆడిస్తానని డైపర్లు వేసుకోవాలని రాజయ్య కడియం శ్రీహరిపై విరుచుకుపడ్డారు. కడియం శ్రీహరి సైతం దళిత బందు అక్రమార్కుడని ఇక చూసుకుందామని కడియం శ్రీహరి సైతం ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎన్నికలవేళ కడియం తాటికొండల మాటల దాడి తారాస్థాయికి చేరనుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Embed widget