By: ABP Desam | Updated at : 21 Mar 2023 05:00 PM (IST)
ఆత్మీయ సమ్మేళనాలు ఘనంగా నిర్వహించాలి- సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి
BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఘనంగా నిర్వహించాలి- సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి
ఉమ్మడి జిల్లా ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ : బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలపై ఫోకస్ చేస్తున్నారు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గ స్థాయిల వారీగా నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాలు, వాటి ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా కు సంభందించిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, హన్మకొండ, వరంగల్ జిల్లాల పార్టీ ఇంఛార్జి, ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ రావు, జిల్లా ముఖ్య నేతలతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో సీఎం కేసీఆర్ సందేశం, పార్టీ ప్రతి కార్యకర్తకు చేరాలి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరల పెరుగుదల, మోదీ ప్రభుత్వ విధానాల వైఫల్యాలు ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అటు దేశ ప్రజలతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను వివరించాలి అన్నారు. పార్టీకి కార్యకర్తలే దేవుళ్ళని వారిని కాపాడుకోవలసిన బాధ్యత మనదేనని వారిని సమీక్షలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, GWMC మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్యేలు రాజయ్య, ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీష్ కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు వాసుదేవ రెడ్డి,నాగుర్ల వెంకటేశ్వర్లు, మార్నేని రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈడీకి కవిత రాసిన లేఖపై కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఏ ఆధారం లేకుండా ముందే ఉంహించి, నోటీసుల కంటే ముందే నవంబర్‌లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎలా మాట్లాడారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ ఎమోషనలయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆడబిడ్డనుపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు! ఫోన్లన్ని భద్రంగా ఉన్నాయని గతంలో కవిత స్పష్టం చేశారని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. ఈడీకి కవిత రాసిన లేఖపై కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాని మెడికల్ కాలేజీ వచ్చిందని, మతి భ్రమించి మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఆడవాళ్లు కొట్లాడారో కిషన్ రెడ్డికి తెలియదా అని అన్నారు.
Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!
Group1: గ్రూప్-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Nagar Kurnool: నాగర్ కర్నూల్లో సీఎం కేసీఆర్ టూర్ - కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ ప్రారంభం
Telangana: కులవృత్తులు, చేతి వృత్తుల వారికి రూ.1లక్ష ఆర్థిక సాయం, దరఖాస్తులు ప్రారంభం
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!