అన్వేషించండి

TGSRTC: సంక్రాంతికి ఊరెళ్లేందుకు బస్సులు రెడీ - తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్, పూర్తి వివరాలివే!

Telangana News: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణతో సహా ఏపీలోని ప్రధాన నగరాలకు ప్రత్యేక సర్వీసులను నడపనుంది.

TGSRTC Special Buses For Sankranthi Festival: తెలుగువారికి పెద్ద పండుగ సంక్రాంతి. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం భాగ్యనగరంలో స్థిరపడ్డ వారంతా ఆ 3 రోజుల వేడుక కోసం సొంతూళ్లకు పయనమవుతారు. ఈ క్రమంలో పండుగకు ఊరెళ్లే వారికి టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. గతేడాది సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించగా.. రద్దీ ఎక్కువగా ఉండడంతో 5,246 బస్సులు ఏర్పాటు చేసింది. 

ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి 6,432 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 9 నుంచి 15 వరకూ ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరనున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను ఆర్టీసీ నియమించింది.

ఏపీలోని ప్రధాన నగరాలకు..

హైదరాబాద్ (Hyderabad) నుంచి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు (AP) కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమహేంద్రవరం, రాజోలు, ఉదయగిరి, విశాఖ, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి నగరాలకు ఈ బస్సులు నడుస్తాయి. తెలంగాణతో పాటు ఏపీ నుంచి తిరుగు పయనమయ్యే వారి కోసం కూడా ఈ ప్రత్యేక బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా సంస్థ ప్లాన్ చేస్తోంది.

ముందస్తు రిజర్వేషన్లు..

మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అమల్లో ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని తెలిపింది. ఇక ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in లో చేసుకోవాలని పేర్కొంది. ప్రత్యేక బస్సులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ 040 - 69440000, 040 - 23450033 నెంబర్లకు సంప్రదించాలని సూచించింది.

ఏపీఎస్ఆర్టీసీ సైతం

అటు, సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) సైతం ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌ (Hyderabad) నుంచి ఏపీలోని తమ స్వస్థలాలకు వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులు (Special Buses) నడపనున్నట్లు వెల్లడించింది. ఇవి జనవరి 9 నుంచి 13 వరకూ అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ స్పెషల్ బస్సులు రెగ్యులర్ ఛార్జీలే ఉంటాయని, అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. 

Also Read: SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
Villa Orchids Security Failure: కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?
కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget