అన్వేషించండి

Telangana New Ministers: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు - హోం, ఎడ్యుకేషన్ సీఎం దగ్గరే

New Ministers: కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలక శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి.

Three newly sworn-in ministers assigned portfolios : ముగ్గురు తెలంగాణ కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, న్యాయ, క్రీడల శాఖను కేటాయించారు.  వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, కమర్షియల్ టాక్స్  శాఖలు కేటాయించారు.  అడ్లూరి లక్షణ్  కు  ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను ఇచ్చారు. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.  ఏ క్షణంలో అయినా అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.  

కీలక శాఖలు తన వద్దే పెట్టుకున్న రేవంత్ 

మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి..  హైకమాండ్ తో సుదీర్ఘ చర్చల తర్వాత ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. వెంటనే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో సమావేశమయ్యారు. తన వద్ద ఉన్న పదకొండు శాఖల్లో కొన్నింటిని కొత్త మంత్రులకు కేటాయించే ప్రక్రియను పూర్తి చేశారు. సీఎం రేవంత్ వద్ద హోం, మున్సిపల్, విద్య వంటి కీలకమైన శాఖలు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి వాటిని కొత్త మంత్రులకు కూడా కేటాయించలేదు. సీనియర్లలో కొంత మంది ఆ శాఖలు తమకు కేటాయించేలా ఆదేశించాలని హైకమండ్  వద్ద లాబీయింగ్ చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది.          

హోంశాఖ కోసం ప్రయత్నాలు చేసిన సీనియర్లు        

రేవంత్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. భట్టి విక్రమార్కతోనూ హైకమాండ్ సంప్రదింపులు జరిపిందని అనుకున్నారు. వారు ప్రధానంగా తమకు హోంశాఖ ను కేటాయించేలా ఒత్తిడి చేశారని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం హోంశాఖను తన వద్దనే అట్టి పెట్టుకున్నారు. అంతే కాదు.. మున్సిపల్ శాఖ, విద్యా శాఖను కూడా ఇతర మంత్రులకు కేటాయించలేదు. ఇప్పటికీ కేబినెట్ లో మూడు ఖాళీగా ఉన్నాయి. ఒక వేళ ఆ మూడు స్థానాలను భర్తీ చేస్తే.. పదవులు పొందేవారికి అత్యంత కీలక శాఖలు లభిస్తాయని అనుకోవచ్చు.           

ప్రభుత్వంలో మరో పవర్ సెంటర్ రాకూడదని అనుకుంటున్నారా?                        

హైకమాండ్ తో చర్చలు , ఇతర సమీకరణాలను చూసుకుని రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఎడ్యుకేషన్, హోం, మున్సిపల్ వంటి కీలకమైన శాఖలకు ప్రత్య్యేకంగా మంత్రి లేకపోవడం వల్ల పాలనపై ప్రభావం పడుతోందని వస్తున్న విమర్శలను రేవంత్ పట్టించుకోలేదు. ఆ శాఖలను కూడా తానే చూసుకోవాలని డిసైడయ్యారు. సీనియర్ల ప్రయత్నాలను రేవంత్ విజయవంతంగా నిలిపివేశారని..  ప్రభుత్వంలో మరో పవర్ సెంటర్ అయ్యేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారని అంటున్నారు. 

నేడో రేపో..  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులతో పాటు క్యాడర్ ఆశిస్తున్న కీలకమైన కార్పొరేషన్ల పదవుల పేర్లను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.  వీటిపైనా ఢిల్లీలో రేవంత్ కసరత్తు చేసి హైకమాండ్ కు జాబితా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget