New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి
New Officers: తెలంగాణ కొత్త ప్రభుత్వంలో ఇంజెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డిని, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
New Officers in Telangana New Government: తెలంగాణ సీఎంగా ఎనుముల రేవంత్ రెడ్డి (Revanthreddy) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది సేపటికే అధికారుల బదిలీలు ప్రారంభమయ్యాయి. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి (Seshadri), తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డిని (Sivadhar reddy) నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రభుత్వం మారిన వెంటనే ఇలా అధికారుల మార్పు సర్వ సాధారణం. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల అమలుపై తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రంపై రెండో సంతకం చేశారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయగా, వారికి శాఖలు కూడా కేటాయించారు. గురువారం సాయంత్రం తొలి కేబినెట్ భేెటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని, సామాన్యులు ఎవరైనా ప్రజా భవన్ కు వచ్చి తమ సమస్యలు విన్నవించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు కంచెలు తొలగిస్తున్నట్లు చెప్పారు.
Also Read: Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?