అన్వేషించండి

Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ రిజర్వేషన్లు.. మేయర్లు, చైర్మన్ల స్థానాల్లో బీసీలు, మహిళలకు పెద్దపీట

తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల చైర్మన్లు, మేయర్ల పదవులకు రిజర్వేషన్లను పురపాలక శాఖ ఖరారు చేసింది. శనివారం నాడు రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి వివరాలతో ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Municipal Election Reservations | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక అడుగు పడింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్లు, మేయర్ల పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీలు , 10 మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లను ఖరారు చేసిన ప్రభుత్వం బీసీలు, మహిళలకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది.  

రాష్ట్ర ప్రభుత్వం 121 మున్సిపాలిటీల్లో 31.4 శాతం కోటా కింద 38 స్థానాలను బీసీలకు కేటాయించింది. ఇందులో 19 స్థానాలు బీసీ మహిళలకు, 19 స్థానాలు బీసీ జనరల్ కు కేటాయించారు.  ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేస్తూ ఏ ఏ స్థానం ఏ వర్గానికి కేటాయించారో స్పష్టతనిచ్చింది.

మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు: రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు సంబంధించి ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు.

  • ఎస్టీ (ST) వర్గం: కల్లూరు, భూత్పూర్, మహబూబాబాద్, కేసముద్రం, ఎల్లంపేట 5 మున్సిపాలిటీలను ఎస్టీలకు కేటాయించారు. ఇందులో కేసముద్రం, ఎల్లంపేట స్థానాలు ఎస్టీ మహిళలకు దక్కాయి.

  • ఎస్సీ (SC) వర్గం: స్టేషన్ ఘన్‌పూర్, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్, ఏదులాపురం, డోర్నకల్, లక్సెట్టిపేట్, మూడుచింతలపల్లి, నందికొండ, మొయినాబాద్, గడ్డపోతారం, కోహిర్, ఇంద్రేశం, చీర్యాల్, హుస్నాబాద్, వికారాబాద్, మోత్కూరు మొత్తం 17 మున్సిపాలిటీ చైర్మన్ స్థానాలను ఎస్సీలకు కేటాయించారు. 
    ఇందులో చొప్పదండి, హుజూరాబాద్, ఏదులాపురం, గడ్డపోతారం, ఇంద్రేశం, చీర్యాల్, వికారాబాద్, మోత్కూరు 8 మునిసిపాలిటీలను ఎస్సీ మహిళలకు కేటాయించారు. 

  • బీసీ (BC) వర్గం: యల్లందు, జగిత్యాల, కామారెడ్డి, బాన్సువాడ వంటి 38 మున్సిపాలిటీలను బీసీలకు కేటాయించారు.

  • ఇందులో జగిత్యాల, కామారెడ్డి వంటి స్థానాలను బీసీ మహిళలకు, జంగాం, సిద్దిపేట వంటి స్థానాలను బీసీ జనరల్ కేటగిరీకి కేటాయించారు.

  • అన్‌రిజర్వ్‌డ్ (Unreserved 61): పరకాల, రాయికల్, జడ్చర్ల, తొర్రూరు, చండూర్, మెట్‌పల్లి, ఎల్లారెడ్డి, నకిరేకల్, హాలియా, కోస్గి, మక్తల్, ఖానాపూర్, భైంసా, బోధన్, సుల్తానాబాద్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, శంకర్‌పల్లి, ఆమన్‌గల్లు, కొత్తూరు, పెబ్బేరు, నారాయణఖేడ్, అందోలు- జోగిపేట, సూర్యాపేట, తిరుమలగిరి, నేరేడుచర్ల, కొడంగల్, అమరచింత, వర్ధన్నపేట, పోచంపల్లి(30).

  • అన్‌రిజర్వ్‌డ్ విభాగంలో మహిళలకు ఆదిలాబాద్, కోరుట్ల, బెల్లంపల్లి, ధర్మపురి, సత్తుపల్లి, అశ్వారావుపేట, వైరా, మధిర, మరిపెడ, క్యాతన్‌పల్లి, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్, అలియాబాద్, చిట్యాల, నిర్మల్, భీమ్‌గల్, ఆర్మూర్, సిరిసిల్ల, సదాశివపేట, సంగారెడ్డి, ఇస్నాపూర్, నారాయణపేట, కల్వకుర్తి, గద్వాల, వనపర్తి, యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటుప్పల్‌, మిర్యాలగూడ, కోదాడ (31) కేటాయించారు 

కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు: నగర పాలక సంస్థల (Corporations) మేయర్ పదవుల రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగూడెం మేయర్ స్థానాన్ని ఎస్టీలకు, రామగుండం స్థానాన్ని ఎస్సీలకు కేటాయించారు. బీసీ వర్గానికి మహబూబ్ నగర్ (మహిళ), మంచిర్యాల, కరీంనగర్ స్థానాలు దక్కాయి. హైదరాబాద్ (GHMC), ఖమ్మం, నిజామాబాద్ మేయర్ పీఠాలను మహిళలకు (General) కేటాయించగా, వరంగల్ (GWMC) స్థానాన్ని అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంచారు.

మొత్తం 10 కార్పొరేషన్ల రిజర్వేషన్లు  
 మహబూబ్‌నగర్ బీసీ (మహిళ) 
 మంచిర్యాల బీసీ (జనరల్)   
 నిజామాబాద్ అన్‌రిజర్వ్‌డ్ (మహిళ) 
 వరంగల్ అన్‌రిజర్వ్‌డ్ (మహిళ) 
 కరీంనగర్ బీసీ (జనరల్) 
 రామగుండం ఎస్సీ (జనరల్)
 ఖమ్మం అన్‌రిజర్వ్‌డ్ (మహిళ) 
 కొత్తగూడెం ఎస్టీ (జనరల్) 
 సిద్దిపేట అన్‌రిజర్వ్‌డ్ (మహిళ)  
 గ్రేటర్ హైదరాబాద్ (GHMC) అన్‌రిజర్వ్‌డ్ (జనరల్) 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

KTR Fires On Revanth Reddy:
"యువకులు ఆ*త్మహత్యలు చేసుకుంటున్నారు, జాబ్‌క్యాలెండర్‌ ఏమైంది?" ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్
Breaking News:హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget