By: ABP Desam | Updated at : 28 Jul 2022 05:12 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కుమరం భీమ్ ప్రాజెక్టు
Komaram Bheem Project : ప్రపంచ చరిత్రలోనే ఇదో అద్భుతం. ప్రాజెక్టును కాపాడుకునేందుకు అధికారులు ప్లాస్టిక్ కవర్లు తెచ్చి తిప్పలు పడుతున్నారు. పూరిళ్లలో వర్షం నుంచి కాపాడుకునేందుకు ఇళ్లపై కవర్లు కప్పుతారు కదా అలా ఓ పెద్ద ప్రాజెక్టును కవర్ తో కప్పేశారు. మరి అంత పెద్ద ప్రాజెక్టు ప్రమాదం నుంచి బయటపడుతుందా? అంటే దాని నిర్వహణకు నిధులు లేవని సమాధానం వస్తుంది. ఇదీ తెలంగాణలో ప్రమాదం అంచున ఉన్న ఓ ప్రాజెక్టు పరిస్థితి.
ప్రమాదంలో మరో ప్రాజెక్టు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతకొద్ది రోజుల కిందట కడెం ప్రాజెక్టు ప్రమాదం అంచున నుంచి బయటపడింది. ఆ ప్రాజెక్టుకు గండి పడటంతో ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి తప్పింది. ఇప్పుడు మరో ప్రాజెక్టు పరిస్థితి కూడా ప్రమాదం అంచున ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కుమురం భీం ప్రాజెక్టు ప్రమాదం అంచున ఉంది. ఇటీవలి వర్షాలకు కుమురం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. దీంతో వరద ఉద్ధృతికి ప్రాజెక్టు ఆనకట్ట చివరి భాగం దెబ్బతింది. రాళ్లు, మట్టి కొట్టుకుపోయి బలహీనంగా మారింది. నీటి తాకిడికి మెల్ల మెల్లగా కుంగిపోతుంది. ఆనకట్టను పటిష్టం చేసేందుకు అవసరమైన నిధులు లేక ఇంజినీరింగ్ అధికారులు పాలిథిన్ కవర్లు తెప్పించారు. వరద తాకిడిని తట్టుకునేలా భారీ కవర్ ను దెబ్బతిన్న కట్టపై కప్పేశారు. కొన్నాళ్లుగా ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
విద్యుత్ కనెక్షన్ కట్
ఈ ప్రాజెక్టులో ఇన్ ఫ్లో ఎంతో...అవుట్ ఫ్లో ఎంతో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వరదను లెక్కించే డైల్ గేజ్ వ్యవస్థ లేకపోవడంతో ప్రాజెక్టు పరిస్థితి దారుణంగా మారింది. మరీ దారుణం ఏమిటంటే ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బిల్లులు చెల్లించకపోవడంతో ఏడాది కిందట కనెక్షన్ తొలగించారు. ఇప్పటి వరకు తిరిగి పునరుద్ధరించలేదు. దీంతో జనరేటర్ సహాయంతో గేట్లను ఎత్తి, దించుతున్నారు. ఈ క్రమంలో ఎగువ నుంచి భారీగా వరద వస్తే పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. భారీ వర్షంతో పాటు వరద ఎక్కువగా వచ్చినప్పుడు జనరేటర్ మొరాయిస్తే ప్రాజెక్టు తెగిపోయే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే వాపోతున్నారు.
10 టీఎంసీల ప్రాజెక్టు
10 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు 10 ఏళ్ల కిందట నిర్మించారు. అప్పటి నుంచి నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదకరంగా మారింది. నిధులు లేక కాల్వలు నిర్మించలేదు. 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా ఎక్కడా కూడా సక్రమంగా నీరివ్వలేదని స్థానికులు చెబుతున్నారు. చివరికి ప్రాజెక్టు ఆనకట్టను కూడా కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి కడెం ప్రాజెక్టు అనుభవం తర్వాత కూడా ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టు పక్కల గ్రామస్తులు కూడా భయాందోళనకు గురవుతున్నారు.
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
Minister Harish Rao : మహిళలకు కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, వచ్చే నెల నుంచి ప్రారంభం- మంత్రి హరీశ్ రావు
Komatireddy Venkatreddy : మునుగోడు ఉపఎన్నిక సెమీ ఫైనల్, అలా చేస్తే రాజీనామా చేస్తా- కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Spl Trains to Tirupati : తిరుపతికి టిక్కెట్లు దొరకడం లేదా ? ఇవిగోండి స్పెషల్ ట్రైన్స్ వివరాలు
KTR On MODI : పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!
ఇక ఆన్లైన్లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!
చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?