By: ABP Desam | Updated at : 06 Apr 2022 07:40 PM (IST)
స్వయం ప్రకటిత దేవత చుట్టూ డీహెచ్ శ్రీనివాస్ ప్రదిక్షణలు
చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదన్నట్లుగానే.. చేస్తున్న ఉద్యోగానికి వెలగబెట్టే పనులకూ కూడా సంబంధం ఉండదు. తెలంగాణ హెల్డ్ డైరక్టర్ గడల శ్రీనివాసరావు ఏం చేశారో తెలుసుకుంటే ఇదే నిజమని అనుకోక తప్పదు. గడల శ్రీనివాసవు డీహెచ్ హోదాలో ఉన్నారు. ఆయన వైద్యుడు. అంతకు మించి తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని భద్రంగా చూసుకునే ఉన్నత స్థానంలో ఉన్నారు. కానీ ఆయన మూఢ నమ్మకాలతో పూజలు చేయడం.. ఆ వీడియోలు బయటకు రావడం ఇప్పుడు సంచలనాత్మకం అయింది.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మాండల ఎంపీపీ విజయలక్ష్మి తనకు తానే దేవతగా ప్రకటించుకుంది. స్వయంగా పూజలు చేస్తున్నారు. ప్రత్యంగి మాతగా ప్రకటించుకుని క్షుద్రపూజల తరహాలో పూజలు చేస్తూ.. వచ్చిన వారి కోరికలు నెరవేరుతాయని నమ్మ బలుకుతున్నారు. ఈ విషయం ఎలా తెలిసిందో కానీ శ్రీనివాసరావుకు తెలిసింది. మామూలుగా అయితే ఆయన చదివిన చదువుకు... చేస్తున్న ఉద్యోగానికి ఇలాంటి స్వయం ప్రకటిత దేవతల అంశన్ని ట్రాష్‌గా తేల్చి.. మోసంగా భావించాలి. కానీ ఆయనకు మాత్రం ఎక్కడో గురి కుదిరింది.వెంటనే కొత్తగూడెం వచ్చిన గడల శ్రీనివాసరావు ఆమె వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అంతే కాదు.. ఎంపీపీ చుట్టు ప్రదక్షిణలు చేయడం .. ఆమెకు నమస్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
కరోనా సమయంలో డీహెచ్ శ్రీనివాసరావు ఎక్కువ బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన తరచూ మీడియా ముందుకు వచ్చేవారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు కూడా ఉండటంతో ఆయనపై పలుమార్లు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా పదవిలోనే కొనసాగారు. ఇప్పుడు తనకు రాజకీయ ఆశలు ఉన్నాయని.. వాటిని నెరవేర్చుకోవాలన్న లక్ష్యంతో ఇప్పుడు పూజల బాట పట్టారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆయన కొత్త గూడెంలో తరచూ పర్యటిస్తున్నారు. దేవుడు కరుణిస్తాడని తన సన్నిహితులకు చెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూఢనమ్మకాలను నమ్మొద్దంటూ చెప్పాల్సిన హెల్త్ డైరెక్టర్..ఇలా పూజలు చేయడం.. తనను తాను దేవతగా చెప్పుకుంటున్న మహిళా మాటలు వినడం, ఆమెకు పూజలు చేయడం , దేవతగా కొలవడం వంటివి చేయడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తాను క్షుద్ర పూజల్లో పాల్గొనలేదని డీహెచ్ క్లారిటీ ఇచ్చారు. అవి గిరిజన దేవతా ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేందముందని ప్రశ్నించారు. స్థానికుల ఆహ్వానం తోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. స్వయం ప్రకటిత దేవత తో సంబంధం లేదన్నారు. మూఢ నమ్మకాలను అసలే విశ్వసించనన్నారు. తప్పుడు అర్థాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. తన తండ్రి స్పూర్తితో జీఎస్సాఆర్ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు విస్తృతంగా సామజిక సేవలు అందిస్తుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదన్నారు . ట్రస్ట్ద్వారా ఇప్పటికే ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్లు చేయించానని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
TSLPRB: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు చివరి అవకాశం!
Weather Latest Update: నేడు అక్కడక్కడా వడగాలులు, ఇంకో 3 రోజులు ఎండ అధికమే - కారణమేంటో ఐఎండీ
TSPSC Group1 Exam: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్!
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Google AI Course: ఉచిత ఏఐ కోర్సులు అందిస్తున్న గూగుల్, పూర్తి చేసిన వారికి బ్యాడ్జ్‌లు
Sunny Leone Pictures : సన్నీ లియోన్‌కి నచ్చిన బికినీ - ప్రతిరోజూ అలా నడిస్తేనా...
Vitamin C: మీ శరీరానికి ‘విటమిన్ C’ ఎంత ముఖ్యమో తెలుసా?