అన్వేషించండి

Telangana BC reservation guarantee: 42 శాతం రిజర్వేషన్లు చట్టపరంగా అసాధ్యం - బీసీలను ఇంకా మభ్యపెడుతున్న తెలంగాణ ప్రభుత్వం - ఎంత కాలమిలా?

BC reservations: 42 శాతం BC రిజర్వేషన్లు చట్టపరంగా సాధ్యం కావని తెలిసినా తెలంగాణ ప్రభుత్వం పొలిటికల్ గేమ్ ఆడుతూనే ఉంది. నిజం చెప్పి ఎన్నికలకు వెళ్లేందుకు ముందుకు రావడం లేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బీసీలకు 42% రిజర్వేషన్ల హామీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం సవాళ్లు ఎదుర్కొంటోంది.
  • కులగణన తర్వాత 42% రిజర్వేషన్ బిల్లులు సుప్రీంకోర్టులో తిరస్కరణకు గురయ్యాయి.
  • 50% రిజర్వేషన్ పరిమితి, రాజ్యాంగ సవరణ ఆవశ్యకత అమలుకు అడ్డంకులు.
  • ప్రజలకు వాస్తవాలు చెప్పి, పార్టీపరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ప్రభుత్వానికి అవసరం.

BC reservations are not legally possible:బీసీ  రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్తామని గతంలో చాలెంజ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అవి సాధ్యం కాకపోవడంతో ఎలా ముందుకెళ్లాలా అన్నదానిపై కిందా మీదా పడుతోంది. సాధ్యం కావడం లేదు అని ప్రజలు చెప్పడానికి మొహమాట పడుతోంది. అలాగే మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.  

బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని రేవంత్ ప్రకటన 

తెలంగాణలో బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (BC)లకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన కాంగ్రెస్ హామీ, ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని "కామారెడ్డి డిక్లరేషన్"గా ప్రకటించి, BCల ఓటు బ్యాంకును సృష్టించుకుంది.  కానీ, తాజా హైకోర్టు స్టే, సుప్రీంకోర్టు తిరస్కారాలు,  ఆర్థిక-చట్టపరమైన సమస్యల మధ్య, "ఇది సాధ్యమే కాదని " క్లారిటీ వస్తోంది.  తెలంగాణలో BCలు 56 శాతం జనాభా ఉన్నారు. కులగణనలో ఇది తేల్చారు. కానీ  29 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవి ఉద్యోగ, విద్య అవకాశాల్లో. రాజకీయంగా అయితే స్థానిక ఎన్నికల్లో    25 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉంది.          

కులగణన చేసినా .. బిల్లులకు లభించని ఆమోదం          

కాంగ్రెస్ 'కామారెడ్డి BC డిక్లరేషన్'లో BCలకు 42% రిజర్వేషన్లు, కులగణన చేస్తామని ప్రకటించారు.  కులగణన చేశారు. హౌస్-టు-హౌస్ డేటా కలెక్షన్ చేశారు.   BCలు 56.33% అని రిపోర్ట్ వచ్చింది.  ఈ డేటా ఆధారంగా  అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్ చేశారు.   విద్య, ఉద్యోగ  లోకల్ బాడీల్లో 42% BC కోటా కల్పించారు. కానీ సుప్రీంకోర్టు పెట్టిన 50% కోటాను దాటిపోతుంది. బిల్లులు ఆమోదించాలని ఆగస్టులో రేవంత్ ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. చివరికి జీవో ఇచ్చారు. ా జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది.  ప్రభుత్వం సుప్రీంకోర్టులో SLP ఫైల్ చేసింది. ఆ ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టి వేసింది.            

రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్ లో పెడితేనే చెల్లుబాటు..  అది సాధ్యం కాదు ! 
 
ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ ను ప్రధానిని చేసుకుని బిల్లును ఆమోదించుకుంటామని ప్రకటించారు. అంటే ఆయనకు ఇప్పుడల్లా లీగల్ గా రిజర్వేషన్లు రావని క్లారిటీ ఉన్నట్లే. అయితే బిల్లులు ఆమోదించడం లేదని కేంద్రాన్ని నిందిస్తున్నారు. 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "42% కోటా సైంటిఫిక్, BCల హక్కు. బిజేపీ కేంద్రం బిల్లులు పెండింగ్‌లో పెట్టి BCలను మోసం చేస్తోంది" అని  ఆరోపిస్తున్నారు.  కానీ న్యాయపరంగా ఊరట లభించలేదు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో SLP ఫైల్ చేసింది, కానీ SC "హైకోర్టు స్టే సరైనది" అని తిరస్కరించింది.              

ఇప్పటికీ అది సాధ్యం కాదని ప్రజలకు చెప్పలేకపోతున్న ప్రభుత్వం 
 
సుప్రీం కోర్టు 1992 ఇంద్రా సాహ్ని జడ్జ్‌మెంట్ ప్రకారం 50% రిజర్వేషన్ క్యాప్ పెట్టింది. కానీ తమిళనాడు 69 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్‌లో పెట్టారు.  కానీ తెలంగాణకు అది సాధ్యం కాదు. రాజ్యాంగసవరణ అవసరం. అది ఇప్పుడల్లా సాధ్యం కాదు. అందుకే సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్ల అంశంపై.. ప్రజలకు నిజాలు చెప్పి.. పార్ట ీపరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే ప్రజలు ముఖ్యంగా బీసీలు తమను మోసం చేశారని అనుకునే ప్రమాదం ఉంది.   

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Formula E Case Adjourned: ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget