అన్వేషించండి

Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా

Telangana CM Revanth Reddy | తెలంగాణలో త్వరలోనే టీజీపీఎస్సీ ద్వారా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, అర్హులైన నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రేవంత్ రెడ్డి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు నిరుద్యోగులకు శుభవార్త.
  • త్వరలోనే పలు శాఖల్లో టీజీపీఎస్సీ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల.
  • ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది.
  • కాళోజీ స్ఫూర్తితో పేదల సొంతిల్లు కల నెరవేర్చడానికి కృషి.

Telangana Formation Day 2026 | హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే పలు జాబ్ నోటిషికేషన్లను టీజీపీఎస్సీ విడుదల చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.


Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వైభవంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం... రాచరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ సహించదన్నారు. ప్రత్యేక తెలంగాణ కల సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వేడుకలలో భాగంగా విధుల్లో ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విశిష్టసేవా పురస్కారాలను ప్రదానం చేశారు. 

కాళోజీ మాటల స్ఫూర్తితో ముందుకెళ్తున్న తెలంగాణ
"పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" అన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు మాటలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. కాళోజీ స్ఫూర్తితోనే తాము అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ప్రజల హితం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని, తమది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం అన్నారు. గత 30 నెలల తమ పాలనలో ప్రజా సంకల్పాన్ని నిజం చేయడంలో విజయవంతం అయినట్లు పేర్కొన్నారు. తెలంగాణ విజన్-2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని.. రాబోయే రోజుల్లో రాష్ట్ర రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ఈ వేదికగా హామీ ఇచ్చారు.


Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా

Also Read: Pawan Kalyan Hyderabad Meeting Permission Denied: పవన్‌కు షాకిచ్చిన పోలీసులు - మీటింగ్‌కు నో పర్మిషన్ - కోర్టుకు జనసేన నేతలు

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త..
ఎలాంటి న్యాయపరమైన సమస్యలు లేకుండా, అత్యంత పారదర్శకంగా ఇప్పటివరకు 67 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. ఈ నెలలోనే టీజీపీఎస్సీ (TGPSSC) ద్వారా ఇంజినీరింగ్, పీసీబీ, అటవీశాఖ, టౌన్‌ప్లానింగ్, విద్యాశాఖల్లో ఖాళీలకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని  ప్రకటించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, విద్యా రంగంలో భాగంగా ఇప్పటికే 1,362 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ క్లాసులు ప్రారంభించామన్నారు. ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నామని, త్వరలోనే జూనియర్ కాలేజీల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. 


Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా

Also Read: Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

అర్హులైన పేదల సొంతిల్లు కల సాకారం
పేదలకు సొంతింటి కలను సాకారం చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అద్దె ఇళ్ల బాధలు, కష్టాల నుండి పేదలకు విముక్తి కలిగించేందుకు గత 13 నెలల కాలంలో 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించగా, ఇందుకోసం రూ.22 వేల కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, ఈసారి క్యూఆర్ (Core Urban Region Economy) పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. కొత్త రేషన్‌కార్డులను కూడా పంపిణీ చేసి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. 

Frequently Asked Questions

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఏ శుభవార్త చెప్పారు?

త్వరలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజినీరింగ్, పీసీబీ, అటవీశాఖ, టౌన్‌ప్లానింగ్, విద్యాశాఖల్లో ఖాళీలకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం తెలిపారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు.

తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ప్రాధాన్యత ఇస్తోంది?

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సంక్షేమానికి, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

అర్హులైన పేదల సొంతిల్లు కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది?

గత 13 నెలల్లో 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని సీఎం తెలిపారు. ఈసారి క్యూఆర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో డిన్నర్ భేటీ!
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో డిన్నర్ భేటీ!
Breaking News:
"మొన్నటి ఎన్నికల్లో చెత్తను క్లీన్ చేశారు" కొడాలి నానిపై చంద్రబాబు సెటైర్లు 
KTR At Yuva Sangrama Sadassu : 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం! నిరుద్యోగుల బాధ్యత నాదేనన్న కేటీఆర్
"అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల బాధ్యత నాదే" సరూర్‌నగర్‌ సభలో కేటీఆర్ ప్రకటన 
BRS Yuva Sangrama Sadassu: బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget