అన్వేషించండి

DK Sivakumar: 'మా అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు యత్నిస్తున్నారు' - సీఎం కేసీఆర్ పై డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు

Telangana Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.

DK Sivakumar Sensational Comments on CM KCR: ఈ నెల 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు (Telangana Elections Resluts 2023) వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు (Telangana Exit Polls 2023) కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Sivakumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ సునాయాసంగా అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. 'కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) ప్రయత్నిస్తున్నారు. మా పార్టీ అభ్యర్థులే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అయితే, గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం రాదు.' అని డీకే తెలిపారు.

హైదరాబాద్ కు డీకే

డిసెంబర్ 3న (ఆదివారం) తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు హస్తం వైపే మొగ్గు చూపిన నేపథ్యంలో తాజా పరిస్థితులపై అలర్ట్ అయ్యింది. గెలిచిన తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చర్యలు చేపట్టింది. కొన్ని సంస్థలు హంగ్ వస్తుందని అంచనా వేయగా, ఫలితం అలా వచ్చినా ఏం చేయాలనే దానిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరొందిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను రంగంలోకి దించింది. తెలంగాణ ఎన్నికల ఫలితాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. దీంతో శనివారం సాయంత్రం డీకే హైదరాబాద్ రానున్నారు. 2 రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలించబోమని, ఆ అవసరం రాదని ఇప్పటికే డీకే స్పష్టం చేశారు. గెలుపు అవకాశాలున్న నేతలకు ఆయన ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి కాకుండా చూసుకునే బాధ్యతను డీకే తీసుకున్నట్లు సమాచారం.

ఇదే ఆయన సత్తా

డీకే శివకుమార్.. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి, అక్కడ రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేలా కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో నెగ్గిన అభ్యర్థులు చేజారిపోకుండా అందరినీ ఏకతాటిపై ఉంచడంలో ఎక్స్ పర్ట్ అయిన ఈయన పాలిటిక్స్ లో ట్రబుల్ షూటర్ గా పేరొందారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ ఆయన సేవలను మరోసారి కాంగ్రెస్ అధిష్టానం వినియోగించుకుంటోంది. తాము గెలిచామనే ప్రకటన వచ్చేంత వరకూ, కొత్త ప్రభుత్వం కొలువుదీరేంత వరకూ పూర్తి బాధ్యతలను డీకే పర్యవేక్షించనున్నారు.

అదే వ్యూహమా.?

తెలంగాణ ఎన్నికల ఫలితాల రోజున టీకాంగ్రెస్ బిగ్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఏఐసీసీ ఓ పరిశీలకుడిని నియమించనుంది. సదరు అభ్యర్థి విజయం సాధించాక వారితో డీకే ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సంపూర్ణ మెజార్టీ వస్తే ఇబ్బందే లేదు. లేకుంటే అమలు చేయాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలు, గెలుపొందిన అభ్యర్థులతో చర్చించనున్నట్లు సమాచారం. అయితే, గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ చెబుతుండగా, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ అంచనాలతో నిజమైందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏది డిసెంబర్ 3న ఈ ఉత్కంఠకు తెరపడనుంది.

Also Read: తెలంగాణలో రేపే కౌంటింగ్‌-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు, విశాఖ రైల్వే స్టేషన్లో ఘటన- పలు సర్వీసులకు అంతరాయం
విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు, విశాఖ రైల్వే స్టేషన్లో ఘటన- పలు సర్వీసులకు అంతరాయం
Embed widget