అన్వేషించండి

Bhatti Vikramarka: తెలంగాణలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ: శ్రీశైలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Telangana News | తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క శ్రీశైలంలో పర్యటించారు. హైడల్ ప్రాజెక్టు పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష జరిపారు.

Bhatti Vikramarka Review on Hydel Project in Srisailam | శ్రీశైలం: శ్రీశైలంలో అగ్ని ప్రమాదంలో మరమ్మతుకు గురైన యూనిట్ 4 పనులకు టెండర్లు పిలవాలని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క జెన్కో అధికారులను ఆదేశించారు. తెలంగాణలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ తెస్తామన్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడెల్ పవర్ జనరేషన్ ప్రాజెక్టులో సోమవారం భట్టి విక్రమార్క పర్యటించిన అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇంధన శాఖ సిఎండి ఎస్ .ఏ. ఎం.రిజ్వీతో పాటు స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఒక సీజన్లో 3 నెలల్లో 60 కోట్ల విలువైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం రూ.2 కోట్లు ఖర్చు అయ్యే మరమ్మతులపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగా రూ.60 కోట్ల విలువైన విద్యుత్తును కోల్పోవడం అర్థం లేని పని అన్నారు. 

మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడెల్ జెన్కో ప్రాజెక్టు రాష్ట్రానికి గర్వకారణమైంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా ప్రసిద్ధిగాంచిన హిటాచి సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించింది. ఈ ప్రాజెక్టుతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో 2020లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం దుర్ఘటన బాధాకరం. నాటి షార్ట్ సర్క్యూట్ ప్రమాదం నుంచి యూనిట్ ని కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి శాంతి చేకూరాలి. బాధిత  కుటుంబాలకు ఎప్పుడు ఏం కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ప్రస్తుతం ప్రతి పనికి, అభివృద్ధికి విద్యుత్ అనేది ప్రధాన ఆధారంగా ఉంది. 

జెన్కో ప్రాజెక్టుకు సంబంధించి త్వరగా నిర్ణయాలు తీసుకుంటే, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి ఇక్కడ సాధించవచ్చు. దాంతో తక్కువ ధరలకే తెలంగాణ ప్రజలకు విద్యుత్తు అందించే అవకాశం ఉంది. గత ప్రమాదం నుంచి పని ప్రాంతాల్లో భద్రతాపరంగా ఏం చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. ప్లాంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని అధికారులు కనెక్ట్ చేసుకోవాలి. ప్లాంట్ లోకి వచ్చే ప్రతి మనిషికి చిన్న ఆక్సిజన్ సిలిండర్ తప్పనిసరిగా ఇవ్వాలి. భద్రతా చర్యల విషయంలో నిధులు సమస్య కాదు, మనిషి ప్రాణం విలువైనది, స్వీపర్ నుంచి సీఈ వరకు ఇదే సూత్రం వర్తిస్తుందని’ పేర్కొన్నారు.

ప్లాంట్ లో అధికారులు, సిబ్బంది, కార్మికుల భద్రతకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. Tailpond తెగిపోయింది మరమ్మతులు చేయలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తూ లేఖలు ఇస్తే వెంటనే ఆ పనులు చేపడదామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని, విద్యుత్ శాఖలో స్వీపర్ నుంచి సీఈ వరకు అంతా ఒక కుటుంబంలా పనిచేయాలని ఆయన సూచించారు. మీకు సమస్య వచ్చినా వినడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఆర్టిజన్ల రెగ్యులరైజేషన్, ఉద్యోగులకు డి మోషన్స్ వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మెగా రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, పరిణికా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget