అన్వేషించండి
Cement Factory Accident: మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం, ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం!
కర్మాగారంలోని యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కాంట్రాక్ట్ కార్మికులు కిందపడినట్లుగా తెలుస్తోంది.

ఘటనా స్థలంలో పరిస్థితి
సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మై హోం గ్రూపునకు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాధితులు ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందినవారిగా సమాచారం. కర్మాగారంలోని యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కాంట్రాక్ట్ కార్మికులు కిందపడినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదం విషయంపై మై హోమ్ యాజమాన్యం గోప్యత పాటిస్తుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ప్రపంచం
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion