News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TS Cabinet Meet: నేడు తెలంగాణ కేబినేట్ భేటీ... సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం... దళిత బంధు, ఉద్యోగాల భర్తీ, వరిసాగుపై కీలక చర్చ

తెలంగాణ కేబినేట్ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్నాహ్నాం ప్రగతి భవన్ మంత్రి వర్గం సమావేశం కానుంది.

FOLLOW US: 
Share:

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో గురువాం మధ్యాహ్నం కేబినెట్ భేటీకానుంది. కీలక అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గ సమావేశమవుతోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా దళితబంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం హుజూరాబాద్‌తో పాటు వాసాలమర్రిలో పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తోంది. మరో నాలుగు గ్రామాల్లోనూ దళితబంధును పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. మంత్రివర్గ సమావేశంలో పథకం అమలు తీరుపై పూర్తిస్థాయిలో చర్చించనున్నట్లు సమాచారం. 

ఉద్యోగాల భర్తీపై

గత కేబినెట్ సమావేశం జరిగినప్పుడు రెండ్రోజుల పాటు ఉద్యోగాల భర్తీపై సుదీర్ఘ చర్చ జరిగింది. కానీ నియామకాల ప్రక్రియ కొలిక్కిరాలేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఈ కేబినెట్‌ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏయే శాఖల్లో, ఎన్ని పోస్టుల భర్తీ చేయాలి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ల జారీ, ఇతర అంశాలపై నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాల భర్తీతోపాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో సుమారు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని సీఎం కేసీఆర్‌ గత ఏడాది డిసెంబర్‌ 13న ప్రకటించారు. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని, తద్వారా ఏర్పడే కొత్త ఖాళీలను సైతం గుర్తించి భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే ఉద్యోగుల పదోన్నతులు, స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ కేడర్లుగా పోస్టుల విభజన, ఖాళీల గుర్తింపు ప్రక్రియలు సుదీర్ఘంగా సాగాయి. ఆర్థిక శాఖ ఇటీవలే ఈ అంశాలను కొలిక్కి తెచ్చింది. 65 వేలకుపైగా ఖాళీ పోస్టులను గుర్తించింది. ఈ ప్రతిపాదనలపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. 50 వేల నుంచి 65 వేల పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు జారీ చేసే దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఎత్తిపోతల పథకాలకు ఆమోదం!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ అవసరాలు, వనరుల సమీకరణ, దళితబంధు పథకానికి చట్టబద్ధత తదితర అంశాలపైనా కేబినెట్‌ చర్చించనున్నట్టు తెలుస్తోంది. వనరుల సమీకరణలో భాగంగా మైనింగ్‌ రంగంలో సంస్కరణల అమలు, భూముల వేలానికి సంబంధించిన పలు ప్రతిపాదనలపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే సింగూరుపై రెండు భారీ ఎత్తిపోతల పథకాలను నిర్మించాలనే ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వాటిపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతలను రూ.3,916 కోట్లతో, బసవేశ్వర లిఫ్టును రూ.2,750 కోట్లతో చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించారు. అయితే వ్యయాన్ని తగ్గించడం కోసం సీసీ లైనింగ్‌ పనులను తొలగించి మొత్తం రూ.4,500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పూర్తిచేయాలని, నాబార్డ్‌ నుంచి రూ.2 వేల కోట్ల సాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

వరిసాగుపై కీలక చర్చ

ఇక బాయిల్డ్‌ రైస్‌ కొనుగోళ్లపై కేంద్రం విముఖత నేపథ్యంలో వచ్చే యాసంగిలో వరి సాగుపై ప్రతిష్టంభన నెలకొంది. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతులను సన్నద్ధం చేయడం, వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు తదితర అంశాలపై కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక తెలంగాణకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పై కేంద్రం మొండి చేయి చూపడం. కేంద్రం తీరుపై ఎలాంటి విధానంతో ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించనున్నారు. ఇక గణేశ్ నిమజ్జనానికి హైకోర్టు అడ్డంకులు.. రాబోయే కాలంలో శాశ్వత పరిష్కారంపై కేబినేట్‌లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. 

Also Read: Green Tea: గ్రీన్ టీ తాగే పద్ధతి ఇది... ఎప్పుడుపడితే అప్పుడు తాగేయకూడదు

Published at : 16 Sep 2021 07:38 AM (IST) Tags: Govt Jobs cm kcr TS News Telangana cabinet meet TS Cabinet meet dalith bandhu

ఇవి కూడా చూడండి

DASARA Holidays: తెలంగాణలో దసరా, బతుకమ్మ సెలవులు, మొత్తం ఎన్ని రోజులంటే? ఏపీలో సెలవులు ఇలా!

DASARA Holidays: తెలంగాణలో దసరా, బతుకమ్మ సెలవులు, మొత్తం ఎన్ని రోజులంటే? ఏపీలో సెలవులు ఇలా!

BRS On Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుపై ఎక్కువగా బాధపడుతున్న బీఆర్ఎస్ - హఠాత్తుగా మార్పు ఎందుకు ?

BRS On Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుపై ఎక్కువగా బాధపడుతున్న బీఆర్ఎస్ - హఠాత్తుగా మార్పు ఎందుకు ?

Top Headlines Today: మోత మోగిన ఏపీ; తెలంగాణలో రూటు మార్చిన కేటీఆర్ - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: మోత మోగిన ఏపీ; తెలంగాణలో రూటు మార్చిన కేటీఆర్ - నేటి టాప్ న్యూస్

Weather Latest Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్ తక్కువే: ఐఎండీ

Weather Latest Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్ తక్కువే: ఐఎండీ

నేడు మహబూబ్​నగర్​కు ప్రధాని మోదీ - 13,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నేడు మహబూబ్​నగర్​కు ప్రధాని మోదీ - 13,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

టాప్ స్టోరీస్

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?

Chandrababu Naidu Arrest : బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ - కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?

Chandrababu Naidu Arrest :  బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ  -   కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?

Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ

Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప