అన్వేషించండి

Telangana Cabinet : తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ - 2 డీఏలు మంజూరు చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం !

Telangana Cabinet Decisions: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు 2 డీఏల విడుదలకు ఆమోదం లభించింది. ఏడాదికి రెండున్నర వేల కోట్ల భారం పడుతుందని మంత్రి పొంగులేటి ప్రకటించారు.

Telangana Employees DA Approved:   తెలంగాణలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగ సంఘాలు, జేఏసీ నాయకులతో ఇటీవల జరిపిన చర్చల అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్రంలో ఉద్యోగులకు, పింఛనుదారులకు నిలిచిపోయిన పెండింగ్ కరువు భత్యాల్లో  రెండు విడతల డీఏల విడుదలకు కేబినెట్ అధికారిక ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ,  రిటైర్డ్ పెన్షనర్లకు వేతనాల పరంగా పెద్ద ఊరట లభించనుంది.

కేబినెట్ నిర్ణయాల ప్రకారం.. ఉద్యోగులకు 3.64 శాతం ,  2.74 శాతం చొప్పున మొత్తం రెండు డీఏలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఒక డీఏను త్వరలోనే రాబోయే జీతాలతో కలిపి పంపిణీ చేయనుండగా, మరో డీఏను రాబోయే పండుగలు,  తదుపరి షెడ్యూల్ ప్రకారం విడుదల చేయనున్నారు. అంతేకాకుండా, ఉద్యోగులు ,  పెన్షనర్లకు సంబంధించిన సుమారు రూ. 10,000 కోట్ల పాత జిపిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బిల్లుల బకాయిలను ప్రతి నెలా క్రమం తప్పకుండా విడుదల చేస్తూ రాబోయే కాలంలో పూర్తిగా చెల్లించేలా బడ్జెట్ కేటాయింపులపై స్పష్టమైన కార్యాచరణకు అంగీకారం తెలిపింది.

డీఏల విడుదలతో పాటు పే రివిజన్ కమిషన్   నివేదిక అమలుపై కూడా కేబినెట్ భేటీలో విస్తృతంగా చర్చించారు. పీఆర్సీ కమిటీ అందించే తుది నివేదికను పరిశీలించి, వీలైనంత త్వరగా కొత్త వేతన సవరణపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాల విన్నపాలను సానుకూలంగా పరిశీలించి ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం వెల్లడించింది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఉద్యోగుల అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ధరణి పోర్టల్ స్థానంలో తీసుకురానున్న కొత్త భూపరిపాలన వ్యవస్థ, నిషేధిత భూముల జాబితా  సమీక్ష ,  రైతులకు సంబంధించిన పలు సంక్షేమ పథకాల అమలుపై సభలో చర్చ జరిగింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు సంబంధించి వివిధ నిధుల మంజూరుకు మంత్రివర్గం అమోదముద్ర వేసింది.

 గురువారం నాటి కేబినెట్ సమావేశం బహుళ ప్రాధాన్యత కలిగిన నిర్ణయాలతో ముగిసింది. దసరా, దీపావళి పండుగల వేళ విడుదలైన రెండు డీఏల నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు, చెల్లింపుల షెడ్యూల్ , అర్హతలతో కూడిన అధికారిక జీవోలు  ఆర్థిక శాఖ ద్వారా త్వరలోనే వెలువడనున్నాయి. ఎల్ నినోను ఎదుర్కోవడంపై కేబినెట్ లో చర్చించారు. సబ్ కమిటీని నియమించనున్నారు. కేంద్రాన్ని సాయం అడగాలని నిర్ణయించారు.                     

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Kavitha vs Harish Rao : హరీశ్ రావుపై కవిత ఆరోపణలు - రేవంత్ స్క్రిప్ట్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కౌంటర్.. కాంగ్రెస్‌కు లాభం చేకూరే రాజకీయమా?
హరీశ్ రావుపై కవిత ఆరోపణలు - రేవంత్ స్క్రిప్ట్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కౌంటర్.. కాంగ్రెస్‌కు లాభం చేకూరే రాజకీయమా?
Telangana Phone Tapping Case: ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్ పేర్లతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జ్‌షీట్ రెడీ? - తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగ!
ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్ పేర్లతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జ్‌షీట్ రెడీ? - తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగ!
పదేళ్ల వయసులోనే 19 ప్రపంచ రికార్డులు.. 2 రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న కొంకటి ఇతిక్ష
పదేళ్ల వయసులోనే 19 ప్రపంచ రికార్డులు.. 2 రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న కొంకటి ఇతిక్ష
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
Embed widget