అన్వేషించండి

Bandi Sanjay: వరి కొనుగోలుపై బీజేపీ పోరాటం.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్న బండి సంజయ్

వరి ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ 15, 16 తేదీలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు.

తెలంగాణలో రైతుల సమస్యలపై ప్రయోజనాల విషయం పక్కనపెడితే రాజకీయ పార్టీలు మాత్రం తమ మైలేజీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల తరువాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి నిరాశే ఎదురైంది. మరోవైపు అధికారంలోకి రావాలని చూస్తోన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం రైతుల సమస్యలపై నినదిస్తున్నాయి.

వరి ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే రాష్ట్ర బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపు, ఎల్లుండి జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్న ఆయన రాత్రి సూర్యాపేటలో బస చేయనున్నారు. అర్జాలబావి ఐకేపీ సెంటర్ (నల్గొండ రూరల్ మండలం)ను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకుంటారు. 

అనంతరం మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలుసుకుని వారు సాగు చేస్తున్న పంటలు, మద్దతు ధర, ప్రభుత్వ సహకారం అందుతుందా లాంటి వివరాలు తెలుసుకుంటారు. రాత్రి సూర్యాపేటలో బండి సంజయ్ బస చేయనున్నారు. నవంబర్ 16న తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటించి మార్కెట్ లో ధాన్యం అమ్మకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను పరిశీలించనున్నారు.
Also Read: టీఆర్ఎస్, బీజేపీలకు మాత్రమే అనుమతులా.. కాంగ్రెస్‌కు ఎందుకివ్వరు: రేవంత్ రెడ్డి సూటిప్రశ్న

టీఆర్ఎస్ ప్రభుత్వం వరి వేయకూడదని చెబుతుండగా రైతుల నుంచి కచ్చితంగా వరి కొనుగోలు చేయాలని, మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ నేతలు ఇటీవల ధర్నా చేశారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉండాల్సింది పోయి, కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని బండి సంజయ్ హితవు పలికారు.

బీజేపీ ధర్నా ఎఫెక్ట్‌తో తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంపై తాము పోరాటం చేస్తున్నామని పేర్కొంటూ టీఆర్ఎస్ నేతలు సైతం ఒకరోజు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి వరి కొంటామని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలవలేనప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనంటూ సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: గళమెత్తాల్సిన సమావేశాలకు గైర్హాజర్ ! కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారా ? తెలంగాణ ప్రయోజనాల కోసమా ? 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget