అన్వేషించండి

BRS MLAs Assembly protest: అసెంబ్లీకి వెళ్తే లైంగిక వేధింపుల కేసు పెడతారా - దళిత ప్రేమ ఉంటే గడ్డం ప్రసాద్‌ను సీఎం చెయాలి - రేవంత్‌కు బీఆర్ఎస్ సవాల్

Talasani Demand: అసెంబ్లీకి వెళ్తే లైంగిక వేధింపుల కేసు పెట్టడం ఏమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. దళితులపై ప్రేమ ఉంటే గడ్డం ప్రసాద్ ను సీఎం చేయాలని సవాల్ చేశారు.

Talasani Srinivas Yadav :  తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.   శాసనసభకు వెళ్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా  ఖండించారు.  ఉమ్మడి , విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తాను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఎన్టీఆర్ హయాం నుంచి రాజకీయంలో ఉన్నప్పటికీ, అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న ప్రజాప్రతినిధులపై ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం తన జీవితంలోనే మొదటిసారి చూస్తున్నానని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నా తీవ్రంగా వైఫల్యం చెందిందని, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు.

సెప్టెంబరు 7న అసెంబ్లీ గేటు వెలుపల భారీగా పోలీసులను మోహరించి ఆందోళన సృష్టించాల్సిన అవసరం ఏముందని తలసాని ప్రశ్నించారు. ఆ రోజు జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు దెబ్బలు తగిలాయని, సీనియర్ మహిళా సభ్యులైన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల గొంతు, చీరలు పట్టుకుని పోలీసులు అసభ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణ వెలుపల జరిగిన ఘటనలపై స్పీకర్ పరిధి లేదని చెబుతూనే, ఎమ్మెల్సీ తాతా మధు అనని మాటలను స్పీకర్‌కు ఆపాదించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని నిరూపిస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం ఎలాంటి భేషజాలు లేకుండా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అంటే బీఆర్ఎస్‌కు ఎంతో గౌరవమని, ఆయనను తాము రాజకీయ ప్రయోజనాల కోసం దళిత నేతగా చూడలేదని తలసాని పేర్కొన్నారు. భారత రాజకీయ చరిత్రలోనే  దళిత స్పీకర్ ,  రెడ్డి స్పీకర్ అని వర్గీకరించిన దాఖలాలు లేవని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదే పదే ప్రచారం చేయబట్టే ప్రసాద్ కుమార్ దళితుడనే విషయం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రేవంత్ రెడ్డికి దళితులపై అంతటి ప్రేమ ఉంటే, తక్షణమే గడ్డం ప్రసాద్‌ను ముఖ్యమంత్రిని చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సవాలు విసిరారు. దళితులకు కేసీఆర్ ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరూ ఇవ్వలేదని, ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, నూతన సచివాలయానికి ఆయన పేరును పెట్టి గౌరవించామని గుర్తుచేశారు.

కేసీఆర్ చనిపోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించినా దాంట్లో ఎలాంటి చర్చ పెట్టకపోవడం, ఆ సభ్యుడిని సస్పెండ్ చేయకపోవడం సభానిబంధనల ఉల్లంఘనేనని తలసాని మండిపడ్డారు. అలాగే, బీఆర్ఎస్‌కు చెందని ఎమ్మెల్యేను ప్యానెల్ స్పీకర్‌గా ఎన్నుకోవడం ఏంటని నిలదీశారు. సంధ్యా రావు  అనే ఫేక్ అకౌంట్ కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ నడిపిస్తోందని, తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆప్యాయతలు, వరుసల సంస్కృతిని కాంగ్రెస్ నేతలు తమ బజారు భాషతో నాశనం చేస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. కేసీఆర్ హయాంలో ముషీరాబాద్ ఫ్లైఓవర్, టైమ్స్, సైఫాబాద్ బ్రిడ్జి పనులు పూర్తయితే, రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్లు కట్ చేస్తూ తన ఖాతాలో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు, పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే వరకు తాము పోరాడుతూనే ఉంటామని తలసాని తేల్చిచెప్పారు. నిరసన తెలపడానికి వస్తున్న శాసనసభ్యులపై ఇష్టారీతిన లైంగిక వేధింపుల కేసులు మోపితే.. ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి ఎలా రాగలరని ప్రశ్నించారు. తెలంగాణ సమాజానికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని రాహుల్ గాంధీని, కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.  


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
El Nino Effect: వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
Telangana SIR Electoral Roll Purge: ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget