అన్వేషించండి

Revanth Reddy: రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు, ఓటుకు నోటు కేసులో షాక్!

Notices To Revanth: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది.

Supreme Court: ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది.  ఈ కేసులో ఆయనకు శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి సుప్రీంలో ట్రాన్స్‌ఫర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మోహతా బెంచ్ ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం, ఇతర ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 60 రోజులు పూర్తైంది. ఈ క్రమంలో ఓటుకు నోటు కేసు తెరపైకి రావడం, సుప్రీం నుంచి నోటీసులు రావడం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

నోటీసులకు రేవంత్, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి రెస్సాన్స్ ఇస్తుందనేది కీలకంగా మారింది.  ప్రస్తుతం హోంశాఖ కూడా రేవంత్ దగ్గరే ఉంది. త్వరలో ఓటుకు నోటు కేసుపై ట్రయల్ కూడా మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం, హోంమంత్రిగా రేవంత్ ఉండటంతో ఈ కేసులో విచారణపై ప్రభావం చూపే అవకాశముందని సుప్రీం దృష్టికి జగదీష్ రెడ్డి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. విచారణపై ప్రభావం చూపిస్తే తాము చూస్తూ ఎలా ఉంటామని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిపై ఇప్పటివరకు 88 కేసులు నమోదయ్యాయని,  ఓటుకు నోటు కేసులో ట్రయల్‌ను నిలిపివేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తన పిటిషన్‌లో జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులకు రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. 

కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన 100 రోజుల్లో గత ప్రభుత్వం చెప్పినట్లు చేసిన పోలీస్ అధికారులను నగ్నంగా పరేడ్ చేస్తానని రేవంత్ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా సుప్రీంకు జగదీష్ రెడ్డి అందించారు. రేవంత్ సీఎంగా ఉండటంతో విచారణను ప్రభావితం చేసే అవకాశముందని, పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌కు కేసును బదిలీ చేయాలని కోరారు.  జగదీష్ రెడ్డితో పాటు కల్వకుంట్ల సంజయ్, మహహ్మద్ అలీ, సత్యవతి రాధోడ్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. వీటికి పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. రేవంత్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో రానున్న రోజుల్లో ఈ కేసు రేవంత్‌కు చిక్కులు తెచ్చి పెడుతుందేమోనని హస్తం పార్టీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. 

కాగా, తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో 2015లో రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు నమోదైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి ఓటు వేయాలంటూ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు రేవంత్ డబ్బులు ఆఫర్ చేశారు. అప్పుడు రేవంత్ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. స్టీఫెన్‌సన్ ఇంటికెళ్లి రూ.50 లక్షలు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో కొన్ని రోజుల పాటు రేవంత్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు. ఈ కేసు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget