అన్వేషించండి

Supreme Court: పిరాయింపులపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు ? - తెలంగాణ అసెంబ్లీ సెక్రటరికి సుప్రీంకోర్టు ప్రశ్న

Telangana: ఫిరాయింపులపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారని తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్పీకర్ ను అడిగి చెబుతానని ఆయన తరపు న్యాయవాది తెలిపారు.

defections Case in Supreme Court: పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వేసిన అనర్హతా పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి  మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా అంటూ అసహనం ప్రదర్శించింది. అయితే ఎంత కాలం పడుతుందా అన్నదాదనిపై తాను స్పీకర్ ను అడిగి నిర్ణయం చెప్తాననని ముకుల్ రోహిత్గి  సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.  

బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు             

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎన్నికల్లో గెలిచి, తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మందిపై అనర్హతా వేటు వేయాలని రెండు వేర్వేరు పిటిషన్లను బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసారు.  పోచారం, కాలే యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆ మేరకు తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించలేమని,  ఎటువంటి గడువు విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ తరపున ఈ పిటిషన్లు దాఖలు చేశారు.       

రెండు వేర్వేరు పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ నేతలు              

బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వారిని అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ కార్యదర్శి హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందని, దీనికి కాలపరిమితి లేదని ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే, స్పీకర్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ హైకమాండ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.               

వచ్చేవారం స్పీకర్ చెప్పబోయే నిర్ణయంపై ఆసక్తి     

ఇలాంటి పిటిషన్లపై నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్ కు మాత్రమే ఉందని.. కోర్టులు ఆదేశించలేవని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. తదుపరి విచారణలో స్పీకర్ ఏం చెబుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.     

Also Reas : First GBS Case in Hyderabad: తెలంగాణలో తొలి గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసు నమోదు, ఓ మహిళకు జీబీఎస్ పాజిటివ్

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
Bandi Bhagirath Bail: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు ఊరట! పోక్సో కేసులో బెయిల్!
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు ఊరట! పోక్సో కేసులో బెయిల్!
Rainbow Hospital: ఐదో అంతస్తు నుంచి పడిన బాలుడికి పునర్జనమ్మ! క్లిష్టమైన చికిత్స చేసి ప్రాణం పోసిన రెయిన్‌బో హాస్పిటల్ వైద్యులు! 
ఐదో అంతస్తు నుంచి పడిన బాలుడికి పునర్జనమ్మ! క్లిష్టమైన చికిత్స చేసి ప్రాణం పోసిన రెయిన్‌బో హాస్పిటల్ వైద్యులు! 
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget