అన్వేషించండి

BRS Blow Out: మైడియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు కవిత లేఖ - ఆరు పేజీల్లో తీవ్ర అసంతృప్తి- పార్టీలో గొడవలు నిజమే !

Kavitha : కేసీఆర్ కు కవిత రాసిన ఆరు పేజీల లేఖ వెలుగులోకి వచ్చింది. కొంత కాలంగా బీఆర్ఎస్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని జరుగుతున్న ప్రచారానికి ఈ లేఖ బలం చేకూర్చింది.

Kavitha Blast: తండ్రి కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందని.. 2001 నుంచి మన పార్టీలో ఉన్న వారు ప్రసంగిస్తే బాగుండేదని లేఖలో పేర్కొన్నారు. ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలం అయ్యామని.. బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని సలహా ఇచ్చారు. భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారన్నారు. 

నేను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను డాడీ.. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ  అని కవిత లేఖలో పేర్కొన్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది. 
ఈ పొలిటికల్ సినారియోను అడ్రెస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఇస్తారని అంతా భావించారు. ఇప్పటికైనా 1-2 ప్లీనరీ పెట్టాలని లేఖలో కోరారు. 

ఈ లేఖలో కేసీఆర ప్రసంగంపై తన అభిప్రాయాలను చెప్పారు. కొన్ని అంశాలు బాగున్నాయని చెప్పిన కొన్ని అంశాలను విస్మరించడం పై ప్రశ్నించారు.  బీజేపీపై రెండే నిమిషాలు మాట్లాడటం అనుమానాలకు తావిస్తోందన్నారు.  వక్ఫ్ బిల్లుపై మాట్లాడి ఉంటే బాగుండేదని.. యఅలాగే బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు.  పహల్గాం  మృతులకు నివాళి అర్పించడం బాగుందన్నారు. కాంగ్రెస్ ఫెయిల్ అని చెప్పిన తీరు బాగుందని.. అలాగే రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం కూడా చాలా మందికి నచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి .. తిడుతున్నా .. తిరిగి తిట్టలేదన్నారు.  లేఖలో ప్లీనరీపై పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అని పేర్కొన్నారు. 

అంతర్గత విభేదాలు, కుటుంబ రాజకీయాలు: పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, కేవలం కేటీఆర్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీలోని అంతర్గత రాజకీయాలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఆస్తులు, నాయకత్వం కేవలం ఒకరిద్దరికే పరిమితం అవుతున్నాయని ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది.  మహిళా సమానత, సామాజిక తెలంగాణ లక్ష్యాల వైఫల్యం: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మహిళా సమానత సాధించడంలో, సామాజిక తెలంగాణ లక్ష్యాలను పూర్తి చేయడంలో విఫలమైందని కవిత తన లేఖలో విమర్శించినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీపై వైఖరి: ఢిల్లీ మద్యం కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత, తనను జైలుకు పంపిన బీజేపీపై ప్రతీకారం తీర్చుకోవాలని తాను భావిస్తున్నానని, అయితే పార్టీ అధిష్టానం (కుటుంబం) తనను అడ్డుకుంటున్నట్లు ఆమె లేఖలో ప్రస్తావించినట్లు  చెబుతున్నారు. 

కల్వకుంట్ల కవిత ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ లేఖను కొద్ది రోజుల కిందట రాసినట్లుగా తెలుస్తోంది.  తాజాగా లీక్ కావడం సంచలనంగా మారుతోంది. కొంత కాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని తనను పక్కన పెట్టారని కవిత భావస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ ప్లీనరీ విషయంలోనూ కవితకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. పైగా వేదికపై మాట్లాడే అవకాశం కూడా రాలేదు. ఈ కారణంగా కవిత మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. 

నిజానికి ఇలాంటి అభిప్రాయాలు వెల్లడించాలని అనుకుంటే నేరుగా కేసీఆర్ ను కలిసి చెప్పవచ్చు.కానీ లేఖ రాసి..దాన్ని మీడియాకు లీక్ అయ్యేలా చేయడం అంటే.. పార్టీలో అంతర్గత రాజకీయాలు ఓ స్థాయికి చేరుకున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోందది.

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ishan Kishan Out: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Arnab Cyclone: ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!
Embed widget