News
News
వీడియోలు ఆటలు
X

YS Sharmila : 119 స్థానాల్లో రైతులకు టిక్కెట్లిస్తారా ? కేసీఆర్‌కు షర్మిల చాలెంజ్ !

బీఆర్ఎస్‌ది రైతు ప్రభుత్వమే అయితే 119 స్థానాల్లో రైతులకు టిక్కెట్లు ఇవ్వాలని షర్మిల సవాల్ చేశారు.

FOLLOW US: 
Share:

YS Sharmila :   పదే పదే రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్ రైతులకు 119 స్థానాల్లో టిక్కెట్లు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సవాల్ చేశారు. నిజంగానే కిసాన్ సర్కార్ అయితే.. రుణమాఫీ చేయనందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకే టిక్కెట్లు ఇవ్వాలన్నారు.  దళిత రైతును ముఖ్యమంత్రి చేసి, ఇతర రైతులను మంత్రులను చేయాలి. మాట ఇస్తే.. తలనరుక్కునే ముఖ్యమంత్రికి ఈ దమ్ముందా అని సవాల్ చేశారు.                          

రైతుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో రైతు సమాధులపై దాష్టీక పాలన నడుపుతున్నారని మమండిపడ్డారు.  ఇప్పుడు మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో పడ్డారని..   తెలంగాణలో బుడ్డ దొరలకు, జమీందార్లకు, ఉద్యమద్రోహులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి.. మహారాష్ట్రలో మాత్రం రైతులు అసెంబ్లీకి పోవాలంటూ గప్పాలుకొడుతున్నారని విమర్శించారు.   తెలంగాణ మోడల్ అంటే.. తొమ్మిదేండ్లలో 9వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమా అని ప్రశ్నించారు.  పంట బీమా ఇవ్వక పోవడం.. పంట నష్టం జరిగితే మాట ఇచ్చి పరిహారం ఎగ్గొట్టడం తెలంగాణ మోడలా అని ప్రశ్నించారు.          

 రాయితీ ఎరువులు, విత్తనాలు ఎత్తేశారని..   బడా బాబులకు రూ.వేల కోట్ల రైతుబంధు పేరుతో  దోచి పెడుతున్నారని  ఆరోపించారు.  ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకోవడమా? కనీస కనికరం లేకుండా రైతుల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం రైత ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు.  అసైన్డ్ భూములను సైతం లాక్కొని రైతును రోడ్డునపడేశారని.. కౌలు రైతు.. రైతే కాదని చెప్పడమా? వరి వేస్తే ఉరేనని రైతులను బెదిరించడం రైతు పాలన ఎలా అవుతుందన్నారు.  కేసీఆర్ కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నీది నిజంగానే కిసాన్ సర్కార్ అయితే.. రుణమాఫీ చేయనందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 చోట్ల రైతులకే టికెట్లు ఇవ్వాలన్నారు.                                                                                                              

Published at : 20 May 2023 05:14 PM (IST) Tags: BRS KCR Telangana Politics Sharmila Rythu agenda politics

సంబంధిత కథనాలు

Telangana News : బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యాయత్నం - ఢిల్లీలో కలకలం

Telangana News : బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యాయత్నం - ఢిల్లీలో కలకలం

Telangana Formation Day: తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేస్తే, సోనియా వారి బాధను అర్థం చేసుకున్నారు: మీరా కుమార్

Telangana Formation Day: తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేస్తే, సోనియా వారి బాధను అర్థం చేసుకున్నారు: మీరా కుమార్

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Telangana Formation Day: రాదన్న తెలంగాణను సాధించిన ఘనుడు, పాలకుడిగా నిలిచిన కేసీఆర్- ట్విట్టర్‌లో ప్రశంసలు

Telangana Formation Day: రాదన్న తెలంగాణను సాధించిన ఘనుడు, పాలకుడిగా నిలిచిన కేసీఆర్- ట్విట్టర్‌లో ప్రశంసలు

టాప్ స్టోరీస్

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Samantha: అవును, అది నిజమే - ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’లో పాత్రపై స్పందించిన సమంత

Samantha: అవును, అది నిజమే - ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’లో పాత్రపై స్పందించిన సమంత