అన్వేషించండి

Bollarum Armoury Heist 2026: ఆర్మీ ఆయుధాలను దోచింది రిటైర్డ్ ఆఫీసరే - దొరికిపోయాడు - రికవరీ !

Madras Regiment weapons stolen recovered: మద్రాస్ రెజిమెంట్ ఆర్మరీలో ఆయుధాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ సహా నలుగురిని కస్టడీలోకి తీసుకుని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Telangana Police Task Force Military Intelligence operation:  సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ అత్యంత భద్రతా ఆర్మరీ  నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీకి గురైన ఘటనను విచారణాధికారులు ఛేదించారు. మిలిటరీ ఇంటెలిజెన్స్,  తెలంగాణ పోలీస్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక ఆపరేషన్‌లో చోరీతో సంబంధం ఉన్న నలుగురు అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు నాగర్‌కర్నూలు జిల్లాకు చెందినవారు కాగా, మిగిలిన ముగ్గురు ఇతర ప్రాంతాలకు చెందినవారని సమాచారం. ఆయుధాలను దొంగిలించడం, రవాణా చేయడం , వాటిని దాచిపెట్టడంలో వీరి పాత్రపై అధికారులు విచారిస్తున్నారు.

ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి అసలు మాస్టర్ మైండ్ 

ఈ భారీ చోరీ వెనుక విశ్రాంత ఆర్మీ అధికారి మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సదరు రిటైర్డ్ అధికారికి తన పూర్వ కమాండింగ్ ఆఫీసర్‌తో తీవ్ర వ్యతిరేకత, వివాదాలు ఉన్నాయని, ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టేందుకే ఈ కుట్ర పన్ని ఆయుధాల దొంగతనానికి పథకం రచించినట్లు గుర్తించారు.  విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నాగర్‌కర్నూలు జిల్లాలోని ఒక ప్రదేశం నుంచి చోరీకి గురైన భారీ ఆయుధ నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన రైఫిళ్లు, పిస్టళ్లు, మందుగుండు సామగ్రిని ఆర్మరీ ఇన్వెంటరీ రికార్డులతో అధికారులు సరిపోల్చి తనిఖీ చేస్తున్నారు.

ఆడిటింగ్‌లో వెల్లడైన ఆయుధాల మాయం ఘటన

ఈ చోరీ ఘటన ఆగస్టు 31న ఉదయం 7:50 గంటలకు వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 30న సాయంత్రం 6 గంటలకు ఆయుధాలను సరిచూసి లాక్ చేసిన సిబ్బంది, మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి ఆయుధాల పెట్టెల లాకులు పగులగొట్టి ఉండడాన్ని గమనించారు. ఈ ఘటనలో నాలుగు AK-203 అసాల్ట్ రైఫిళ్లు, ఒక ఇన్సాస్  రైఫిల్, ఏడు పిస్టళ్లు ,  1,800 రౌండ్లకు పైగా మందుగుండు సామగ్రి మాయమైనట్లు గుర్తించారు. ఈ అంశంపై బొల్లారం పోలీసులు బిఎన్‌ఎస్   చట్టంలోని సెక్షన్లు 331(4), 305 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇంటి దొంగల పనేనని గుర్తించిన పోలీసులు

అత్యంత కట్టుదిట్టమైన మిలిటరీ ఆర్మరీ నుంచి దాదాపు 40 కేజీల బరువున్న ఆయుధాలను ఎవరికీ అనుమానం రాకుండా బయటకు తరలించడం అంత సులువు కాదని, దీని వెనుక ఖచ్చితంగా లోపలి వ్యక్తుల ప్రమేయం ఉండి తీరుతుందని అధికారులు మొదటి నుంచీ అనుమానించారు. ఈ క్రమంలోనే ఆర్మరీ నిర్వహణ బాధ్యత వహిస్తున్న ఆర్మీ సిబ్బంది, గార్డులు, అగ్నివీరులు , అధికారులను   ప్రశ్నించారు. దర్యాప్తులో రాత్రి వేళల్లో ఆర్మరీ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు ఆఫ్‌ చేసి ఉండటం, ఆంటి-బర్గ్లరీ అలారాలు పనిచేయకపోవడం వంటి తీవ్రమైన భద్రతా లోపాలను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న వారిని విచారిస్తున్న పోలీసులు ఆయుధాల రికవరీ ప్రక్రియ పూర్తయ్యాక నిందితుల అరెస్టును అధికారికంగా ప్రకటించనున్నారు. సైనిక స్థావరం నుంచి ఈ స్థాయిలో ఆయుధాలు చోరీ కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపగా, ఎట్టకేలకు 11 రోజుల వ్యవధిలోనే మిలిటరీ ఇంటెలిజెన్స్, తెలంగాణ పోలీసులు ఉమ్మడిగా ఈ కేసును ఛేదించడం ఊరటనిచ్చింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cancel Free Bus Scheme: 'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన
'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Jayesh Ranjan IAS to opts VRS | వరుస బదిలీలు.. జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌ నిర్ణయం వేనుక కారణమేంటి!
Jayesh Ranjan | వరుస బదిలీలు.. జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌ నిర్ణయం వేనుక కారణమేంటి!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Embed widget