అన్వేషించండి
Advertisement
20th August 2024 School News Headlines Today: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో ఏపీ సీయం భేటీ , ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన వంటి మార్నింగ్ టాప్ న్యూస్
20th August 2024 School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.
20th August 2024 School News Headlines Today:
నేటి ప్రత్యేకత:
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి
ఆంధ్రప్రదేశ్ వార్తలు :
- సీఎం చంద్రబాబు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అమరావతికి రూ.15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ఈ బ్యాంకులు ముందుకు రావడంతో వారితో సీఎం సమావేశం కానున్నారు. అదేవిధంగా నేటి నుంచి 27వ తేదీ వరకు ఆయా బ్యాంకుల ప్రతినిధులు రాజధానిలో పర్యటించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అమరావతిపై కార్యాచరణను చంద్రబాబు వారికి వివరించనున్నట్టు సమాచారం
- జవాబుదారీతనాన్ని పెంచాల్సిన సోషల్ ఆడిట్ విభాగంలో అవినీతి జరుగుతుందన్న ఫిర్యాదులొస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం అమలులో సిబ్బంది నుంచి డైరెక్టర్ వరకు ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని పవన్ హెచ్చరించారు. కాగా కీలక విభాగాలపైనా నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోందంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థమవుతోందని మంత్రి పవన్ అన్నారు.
తెలంగాణ వార్తలు:
- తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. జోగుళాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ అంతటా ఉరుములతోపాటు భారీ వానలు కురుస్తున్నాయి. కాగా సోమవారం నల్గొండ, సూర్యాపేటలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లో భారీ వర్షం నేపధ్యంలో GHMC అధికారులు రంగంలోకి దిగారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇల్లు విడిచి బయటకు రావొద్దని సూచించారు. పలు చోట్ల స్కూళ్ళకు సలవులు ప్రకటించారు.
- రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఆఫ్రో-ఏషియన్ గేమ్స్‌కు మన హైదరాబాద్ ఆతిధ్యమక ఇచ్చిందని, నగరాన్ని భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు కూడా వేదికగా మార్చాలని కోరుకుండామన్నారు. ఒలింపిక్స్‌లోని ప్రతి క్రీడలో పతకాలు దక్కేలా తెలంగాణ క్రీడాకారులను తీర్చిదిద్దాలని స్పష్టంచేశారు.
జాతీయ వార్తలు:
- ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఖరారైంది. ఈనెల 21, 22 తేదీల్లో పోలాండ్ పర్యటన ముగిసిన అనంతరం, 23న ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు. 23న మోదీ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం అంశంపైనా ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఇది ఎంతో ప్రాధాన్యత కలిగిన పర్యటన అని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది.
- ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని అన్ని విమానాశ్రయాలు, సరిహద్దుల వద్ద నిఘా పెంచారు. ఢిల్లీలోని మూడు ప్రధాన ఆస్పత్రులలో ఐసోలేషన్ వార్డులు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీంతో అనుమానితుడు లేదా వ్యాధి సోకిన వ్యక్తికి తక్షణమే చికిత్స చేసేలా ఏర్పాటు చేశారు. కాగా పాకిస్థాన్‌లో 4వ కేసు నమోదైంది.
అంతర్జాతీయ వార్తలు:
- ఇటలీలో ఘోర ప్రమాదం సంభవించింది. సిసిలీ తీరంలో తీవ్ర తుఫాను వల్ల ఓ విలాసవంతమైన షిప్ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త మైక్ లించ్ సహా ఏడుగురు గల్లంతు అయ్యారు. సిసిలియన్ పోర్టు నుండి ఈయాట్ కు ఈ నెల 14న బయలుదేరిన నౌకలో పది మంది సిబ్బంది, 12 మంది ప్రయాణికులు ఉన్నారు. పోర్టిసెల్లో తీరానికి చేరుకున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా షిప్ మునిగిపోయినట్లు భావిస్తున్నారు.
క్రీడా వార్తలు
- 2024 పారిస్ ఒలింపిక్స్ లో పతకం ఖరాయిందని భావించిన సమయంలో అనర్హతకు గురైన రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఈ విషయం పై కాస్‌లో అప్పీల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ అప్పీల్ ఈ నెల 14న కొట్టేస్తున్నామంటూ తీర్పు ఇచ్చిన కాస్ అందుకు గల కారణాన్ని తాజాగా వివరించింది. తమ బరువు పరిమితికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడం అథ్లెట్ల బాధ్యత అని, ఎట్టిపరిస్థితుల్లోనూ మినహాయింపు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.
- పారాలింపిక్స్‌కుసిద్ధమైన భారత పారా అథ్లెట్ల బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల్లో వారు రాణించాలని ఆకాంక్షించారు. మోదీ సోమవారం పారాలింపిక్స్‌లో పోటీపడే క్రీడాకారులతో వర్చువల్‌గా మాట్లాడారు. మీరేం సాధిస్తారన్నదానితో దేశ ప్రతిష్ఠకు సంబంధముంది. దేశం మొత్తం మీకు మద్దతు తెలుపుతోంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
సినిమా
కరీంనగర్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement