అన్వేషించండి

Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసు - కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు న్యాయస్థానం మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. మే 7 వరకూ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది.

Kavitha Judicial Custody Extended By Rouse Avenue Court: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు (Kavitha) మరోసారి షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) మరో 14 రోజులు పొడిగించింది. మంగళవారంతో ఆమె కస్టడీ ముగియగా.. ఈడీ, సీబీఐ అధికారులు ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరు పరిచారు. కస్టడీ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరించింది. మే 7 వరకూ కవితకు కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా తీర్పు వెలువరించారు. అటు, ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సైతం మే 7 వరకూ న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. దీంతో అప్పటివరకూ వీరిద్దరూ తీహార్ జైలులోనే ఉండనున్నారు.

'60 రోజుల్లో చార్జ్ షీట్'

కవిత బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. ఆమె అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందని కోర్టుకు వివరించారు. మరోవైపు, కవితకు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని ఆమె తరఫు న్యాయవాది రాణా తెలిపారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆరోపిస్తున్నారని.. కొత్తగా ఏమీ చెప్పడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కేసు దర్యాప్తునకు సంబంధించి వివరాలను ఈడీ కోర్టుకు అందజేసింది. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్ సమర్పిస్తామని కోర్టుకు తెలిపింది.

లిక్కర్‌ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తీహార్‌ జైలులో కవిత ఉన్నారు. మళ్లీ ఏప్రిల్‌ 11న సీబీఐ కూడా అదే కేసులో ఆమెను అరెస్టు చేసింది. ప్రశ్నించిన అనంతరం కోర్టులో హాజరు పరచగా కస్టడీ విధించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. మంగళవారంతో జ్యుడీషియల్ కస్టడీ ముగియగా ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు ఆమెకు కస్టడీ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి కవితను సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. దీనిపై ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మే 2న తీర్పు వెల్లడి కానుంది. 

Also Read: Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?

 

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget