News
News
వీడియోలు ఆటలు
X

Revant Letter To DGP : సీబీఐకి కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసూ ఇవ్వాలి - తెలంగాణ డీజీపీకి రేవంత్ రెడ్డి లేఖ !

కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు కూడా సీబీఐకి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డీజీపీకి లేఖ రాశారు.

FOLLOW US: 
Share:

Revant Letter To DGP :  ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లో కలిసిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ డీజీపీ కి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఏఖ రాశారు.   12 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ ప్రబలకు గురి చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి అక్రమంగా చట్ట వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ లో చేర్చుకున్న అంశంలో గతంలోనే ఫిర్యాదు చేశామని లేఖలో రేంత్ రెడ్డి గుర్తు చేశారు. జనవరి 6వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై ఫిర్యాదు చేశామన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లకు ఆర్థిక, రాజకీయ ప్రలోభాలు ఆశ చూపి టిఆర్ఎస్ లో చేర్చుకున్నారని ఈ విషయంలో తాము ఇప్పటికే హైకోర్టులో  పిటిషన్ కూడా వేశామన్నారు.  అందువల్ల ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కు సంబంధించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఆర్.ఐ కేసు నెంబర్ 455 లో తమ ఫిర్యాదు ను కూడా జత చేయాలని విజ్ఞప్తి చేశారు.  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ చేయాలని రేవంత్ కోరారు.   

టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2018 వరకు 4 ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీ లను వివిధ పార్టీ ల నుంచి టిఆర్ఎస్ లో చేర్చుకున్నారని.. 2018 లో ఎన్నికలు జరిగాక మళ్ళీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారని రేవంత్ రెడ్డి డీజీపీకి తెలిపారు. 12 మంది ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ ప్రభుత్వం వివిధ రకాల లబ్ది చేకూర్చారన్నారు.  12 మంది ఎమ్మెల్యేలు లు నేరాలకు అలవాటు పడ్డ వారుగా గుర్తింపు పొందారు. 12 మందిలో 3 ఎమ్మెల్యేలు గతంలో పార్టీ మారి మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీ లోకి మరెందుకు జరిగిన వ్యవహారంలో కూడా ఉన్నారని తెలిరు. 

ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసు ను సీబీఐకి ఇస్తున్నందున.. 12 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశాలను కూడా జత చేసి సీబీఐ.కి ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి చేతికి వెళ్లకుండా ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఐదు సార్లు సీబీఐ లేఖలు రాసినా కేసును ఇంత వరకూ హ్యాండోవర్ చేయలేదు. మరో సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. పదిహేడో తేదీన  హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరపనున్నారు. ఈ లోపు సీబీఐ విచారణ ప్రారంభిస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరిక అంశాన్ని కూడా అందులో కలిపి సీబీఐ విచారణ జరిపేలా చూడాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. 

రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని పోలీసులు పట్టించుకునే అవకాశం లేదు. అయితే  ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో.. కేసీఆర్ .. గతంలో చాలా మందిని ఇలా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారన్న అంశంపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా చేస్తున్నారు.                     

Published at : 09 Feb 2023 01:40 PM (IST) Tags: Tea Congress Revanth Reddy Telangana politics Defection case of Congress MLAs

సంబంధిత కథనాలు

Telangana Decade Celebrations: ఇది నవీన తెలంగాణ, దేశానికి స్ఫూర్తినిస్తున్న తెలంగాణ: సీఎం కేసీఆర్

Telangana Decade Celebrations: ఇది నవీన తెలంగాణ, దేశానికి స్ఫూర్తినిస్తున్న తెలంగాణ: సీఎం కేసీఆర్

Telangana Formation Day: తెలంగాణ సంస్కృతి అద్భుతం, రాష్ట్ర పౌరులందరూ బాగుండాలి - ప్రధాని మోదీ విషెస్

Telangana Formation Day: తెలంగాణ సంస్కృతి అద్భుతం, రాష్ట్ర పౌరులందరూ బాగుండాలి - ప్రధాని మోదీ విషెస్

Telangana Decade Celebrations: ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణలో పాలన : కేసీఆర్

Telangana Decade Celebrations: ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణలో పాలన : కేసీఆర్

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

Telangana Decade Celebrations: సిరిసిల్లలో దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌- తెలంగాణ ప్రగతిలో జిల్లా పాత్ర ప్రత్యేకమైనదని కితాబు

Telangana Decade Celebrations: సిరిసిల్లలో దశాబ్ధి ఉత్సవాల్లో  పాల్గొన్న మంత్రి కేటీఆర్‌- తెలంగాణ ప్రగతిలో జిల్లా పాత్ర ప్రత్యేకమైనదని కితాబు

టాప్ స్టోరీస్

గోల్కొండ కోటపై తెలంగాణ అవతరణ వేడుకలు- జెండా ఆవిష్కరించిన కిషన్ రెడ్డి

గోల్కొండ కోటపై తెలంగాణ అవతరణ వేడుకలు- జెండా ఆవిష్కరించిన కిషన్ రెడ్డి

Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Balineni Meet Jagan :  సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

వాడ వాడలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల జోష్‌- ప్రత్యేక సందేశం ఇవ్వనున్న కేసీఆర్

వాడ వాడలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల జోష్‌- ప్రత్యేక సందేశం ఇవ్వనున్న కేసీఆర్

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!