Paris Olympics 2024: ఒలింపిక్స్ లో పాల్గొన్న తెలంగాణ అథ్లెట్లకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్, పతకాలు తేవాలని ఆకాంక్ష
Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొన్న తెలంగాణ అథ్లెట్లు ఆకుల శ్రీజ, నిఖత్ జరీన్, ఇషా సింగ్, పీవీ సింధులకు ఫోన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి అభినందలు తెలిపారు.
Revanth Reddy Wishes Telangana Athelets at Paris Olympics 2024 | హైదరాబాద్: ఫ్రాన్స్ వేదికగా జరుగుతోన్న విశ్వ క్రీడల్లో భారత క్రీడాకారులు కొన్ని విభాగాల్లో నిరాశ పరిచినా, మరికొన్ని గేమ్స్ లో అదరగొడుతున్నారు. భారత్ కు పతకం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న వారిలో తెలుగు అథ్లెట్లు ఉన్నారు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్ లో ఆయా కేటగిరీల తొలి దశల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తోన్న తెలంగాణ అథ్లెట్లను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), నిఖత్ జరీన్(బాక్సింగ్), పీవీ సింధు (బ్యాడ్మింటన్) లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే తన ఈవెంట్ కోసం సిద్ధమవుతోన్న బెస్ట్ షూటర్ ఇషా సింగ్ (షూటింగ్)కు కూడా సీఎం రేవంత్ రెడ్డి బెస్ట్ విషెస్ చెప్పారు. విశ్వ క్రీడల్లో మన అథ్లెట్లు, క్రీడాకారులు తర్వాతి దశల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కొనసాగించాలని ఆకాంక్షించారు. వారి అపూర్వ విజయంతో భారత్ కు పతకాలు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
#ParisOlympics2024 లో ఆయా కేటగిరీల తొలి దశల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోన్న తెలంగాణ అథ్లెట్స్ @nikhat_zareen (బాక్సింగ్), @SreejaAkula31 (టేబుల్ టెన్నిస్), @Pvsindhu1 (బ్యాడ్మింటన్) లకు ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) July 29, 2024
అలాగే తన ఈవెంట్ కోసం… pic.twitter.com/8ZFPf98UoA