రాష్ట్రానికి సంబంధించిన పలు రక్షణ రంగ భూములు, ప్రాజెక్టుల అంశాలపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Revanth Reddy Delhi Tour: రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
Revanth Reddy Meets Kishan Reddy | ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ భేటీ ఏర్పాటు చేశారు.

- రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో రేవంత్ రెడ్డి ఢిల్లీలో భేటీ.
- గాంధీ సరోవర్ భూములపై కృతజ్ఞతలు; రక్షణ ప్రాజెక్టులు చర్చించారు.
- కిషన్ రెడ్డి చొరవతో అశ్విని వైష్ణవ్‌తో సీఎం రేవంత్ భేటీ.
- మెట్రో విస్తరణ, ఐఆర్ఎఫ్ రుణాలపై కేంద్రంతో కీలక చర్చలు.
Revanth Reddy Delhi Tour | న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. సోమవారం ఉయదం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ కీలక సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు రక్షణ రంగ భూములు, ప్రాజెక్టుల అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. లంగర్ హౌస్ బాపూ ఘాట్ వద్ద చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రక్షణ శాఖ భూములను బదలాయించినందుకుగాను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్, డీఆర్‌డీవో ప్రాజెక్టులపై చర్చ
దేశ సమగ్రత, రక్షణకు సంబంధించిన అంశం అయినందువల్ల ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విమానాశ్రయంలో ఎయిర్ ఫోర్స్ టెర్మినల్‌తో పాటు కార్గో, ఎమ్‌ఆర్‌వో (MRO), హ్యాంగర్ సౌకర్యాలను కల్పించాలని రక్షణ మంత్రిని ఆయన కోరారు. హ్యాంగర్స్ ఏర్పాటుకు ఆదిలాబాద్ విమానాశ్రయం ఎంతో అనుకూలంగా ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. వీటితో పాటు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో ప్రతిపాదిత డీఆర్‌డీవో (DRDO) ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు.
కిషన్ రెడ్డి చొరవతో సాయంత్రం అశ్విని వైష్ణవ్‌తో రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ రాజకీయాల్లో నేటి సాయంత్రం ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. నిత్యం విమర్శలు గుప్పించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఢిల్లీలో ఒకే సమావేశంలో పాల్గొనబోతున్నారు. కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సాయంత్రం 6.30 గంటలకు సీఎం రేవంత్, కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా అశ్విని వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయగా, ఆయన సానుకూలంగా స్పందించి భేటీని ఖరారు చేశారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి కూడా పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారని సమాచారం.
ఈ కీలక సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ టేకోవర్, మెట్రో ఫేజ్-2 విస్తరణతో పాటు, వీటికి సంబంధించిన ఐఆర్ఎఫ్ (IRCF) రుణాల విడుదల అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాష్ట్ర నిధులు, అభివృద్ధి విషయంలో లేఖల యుద్ధం కొనసాగిస్తున్న రేవంత్, కిషన్ రెడ్డి ఢిల్లీలో ఒకే సమావేశంలో పాల్గొనుండటం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీ తర్వాత తెలంగాణ మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని కాంగ్రెస్ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు.
Before You Go
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Frequently Asked Questions
సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఎందుకు సమావేశమయ్యారు?
ఆదిలాబాద్‌లోని విమానాశ్రయంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి ఏమిటి?
ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎయిర్ ఫోర్స్ టెర్మినల్, కార్గో, ఎమ్‌ఆర్‌వో, హ్యాంగర్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరిగే సమావేశంలో ఎవరు పాల్గొననున్నారు?
సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఈ సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.
అశ్విని వైష్ణవ్‌తో సమావేశంలో చర్చించబడే ముఖ్య అంశాలు ఏమిటి?
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ టేకోవర్, మెట్రో ఫేజ్-2 విస్తరణ మరియు వాటికి సంబంధించిన ఐఆర్ఎఫ్ రుణాల విడుదల అంశాలపై చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సానుకూల స్పందన ఆశిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















