News
News
X

Rains in AP Telangana: వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం - నేడు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, IMD రెడ్ అలర్ట్

Rains in AP Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం నేడు వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలకు పలు జిల్లాల్లో రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.

FOLLOW US: 

Rains In Telangana: వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్ గఢ్ వైపు కదులుతూ మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలకు పలు జిల్లాల్లో రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తీరం వెంట బలమైన గాలులు గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. 

తెలంగాణలో భారీ వర్షాలు
అల్పపీడనం తీవ్రరూపం దాల్చడంతో దాని ప్రభావం రాష్ట్రంలో ఉంది. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా జల్లులు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయిని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు భారీ వర్షాలతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప రెండు మూడు రోజులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట వరంగల్ రూరల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలలో ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది. అదే సమయంలో తీరంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల మోస్తరు వర్షం పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాలోలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని ప్రజలను హెచ్చరించారు. 
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

Published at : 09 Aug 2022 07:19 AM (IST) Tags: telangana rains rains in telangana Weather Updates ap rains rains in ap AP Rains

సంబంధిత కథనాలు

Minister KTR : పురపాలక శాఖ గ్లామర్ డిపార్ట్మెంట్ కాదు, ప్రజల ప్రశంసలు దక్కడం సవాలే- మంత్రి కేటీఆర్

Minister KTR : పురపాలక శాఖ గ్లామర్ డిపార్ట్మెంట్ కాదు, ప్రజల ప్రశంసలు దక్కడం సవాలే- మంత్రి కేటీఆర్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

NGT Penalty : తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్, వ్యర్థాల నిర్వహణలో సరిగాలేదని భారీ జరిమానా

NGT Penalty : తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్, వ్యర్థాల నిర్వహణలో సరిగాలేదని భారీ జరిమానా

Warangal News : వరంగల్ లో నకిలీ ఎన్ఐఏ అధికారుల హాల్ చల్, రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్!

Warangal News : వరంగల్ లో నకిలీ ఎన్ఐఏ అధికారుల హాల్ చల్, రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్!

టాప్ స్టోరీస్

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !