News
News
వీడియోలు ఆటలు
X

Telangana: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి- TWJF ఆధ్వర్యంలో నిరవధిక దీక్ష

TWJF: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు.

FOLLOW US: 
Share:

TWJF: - జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి
- TWJF ఆధ్వర్యంలో నిరవధిక దీక్ష
- మద్దతు తెలిపిన వివిధ పార్టీల నాయకులు
- ప్రభుత్వం వెంటనే అందించాలని డిమాండ్

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఇండ్ల స్థలాలు అందించాలనే డిమాండ్ తో బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వివిధ జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు మెడపట్ల సురేష్, షేక్ మోయిజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజహితమే లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు అందిస్తామని ఇది వరకే ప్రకటించిందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై కేసీఆర్ పలుమార్లు లేవనెత్తారు. కానీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఈ క్రమంలో కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎంగా సేవలు అందించారు. కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అంశాన్ని ప్రస్తావించారని తెలిపారు. కానీ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఇంటి స్థలాలు కేటాయింపు జరగడం లేదని పేర్కొన్నారు. దీంతో అనేక ఏండ్ల నుంచి జర్నలిస్టులు అద్దె ఇండ్లలో ఉంటూ అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి స్థలాల విషయమై ఇది వరకే జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు కూడా పలుమార్లు వినతిపత్రాలు అందించామని పేర్కొన్నారు. కానీ ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో పలుచోట్ల జర్నలిస్టులకు స్థలాలు కేటాయించారని.. ఆదిలాబాద్ జిల్లాలోనూ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందజేయాలని కోరారు. ఈ దీక్షలకు ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి, రాష్ట్ర నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అన్నమోల్ల కిరణ్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ ఆశన్న, దారుల్ హన్సార్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు అరీఫ్ ఖాన్, మద్దతు పలికి జర్నలిస్టులతో కలిసి నిరవధిక దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీయూడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు షాహిద్ అహ్మద్ తవక్కల్, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షుడు గంట వినోద్, ఎలక్ట్రానిక్ మీడియా టౌన్ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్, ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కన్వీనర్ ఏర సుధాకర్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రొడ్డ దేవిదాస్, సీనియర్ జర్నలిస్టులు నూకల దేవేందర్, బిర్కూర్ వార్ వెంకటేష్, సంద సురేష్, దత్తాత్రి, సిడాం రవి, అస్మత్ అలీ, అభిలాష్, నిలేష్, ఖిజర్, మహేందర్, రాజేశ్వర్, శ్రీకాంత్, నరేష్ రెడ్డి, దేవారెడ్డి, దీపక్, మహేష్, కిరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Published at : 04 May 2023 12:16 AM (IST) Tags: journalists Telangana KCR TWJF Land For House

సంబంధిత కథనాలు

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!

TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!

Civils Coaching: సివిల్స్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం, వీరు అర్హులు!

Civils Coaching: సివిల్స్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం, వీరు అర్హులు!

No Bag Day: విద్యార్థులకు నాలుగో శనివారం 'నో బ్యాగ్' డే! త్వరలో మార్గదర్శకాలు జారీ!

No Bag Day: విద్యార్థులకు నాలుగో శనివారం 'నో బ్యాగ్' డే! త్వరలో మార్గదర్శకాలు జారీ!

టాప్ స్టోరీస్

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!