అన్వేషించండి

నిజామాబాద్‌ బీజేపీ నేతల్లో టెన్షన్- పదువులు వదులుకుంటున్న లీడర్లు

నియోజకవర్గ ఇంఛార్జ్ పదవులు వద్దుబాబోయ్ అంటున్న బీజేపీ నేతలు. ఆశావాహుల్లో ఆగ్రహం తెప్పిస్తోన్న ఆ నిబంధన ఏంటి. వచ్చే ఎన్నికల్లో పోటీకి నో ఛాన్స్. ఇంచార్జి బాధ్యతలు వద్దంటున్న ఆ నేతలు ఎవరు..

తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు... వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు  నేతలు. అధిష్ఠానం కూడా సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా వడి వడిగా అడుగులు వేస్తోంది. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు... వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో ఇంఛార్జీల బాధ్యతలు అప్పజెప్పింది. ఇక్కడే అధిష్ఠానం పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పిందని బీజేపీలో కలవరం మొదలైంది. 

ఇంఛార్జీలుగా వ్యవహరిస్తున్న వారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని బీజేపీ పెద్దలు చేసిన ప్రకటనతో తెలంగాణలోని ఇన్‌ఛార్జ్‌లంతా ఆందోళనకు గురవుతున్నారట. ఇంఛార్జీలుగా ప్రకటించక ముందు ఈ విషయం తెలియదు. ప్రకటన తర్వాత వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నవారు అయోమయానికి గురవుతున్నారు. ఇంఛార్జీ పదవులు ఇచ్చి మురిపించిన పార్టీ తామకే టికెట్ వస్తునందని భావించిన వారికి ఆశాభంగం కలిగినట్లైంది. విషయం తెలిసిన తర్వాత... నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు మాకొద్దు బాబో అంటున్నారట సదరు నేతలు. ఇతర రాష్ట్రాల్లో ఫార్ములా తెలంగాణలో సక్సెస్ అవుతుందా అంటే కాదనేది కొందరి అభిప్రాయం. పార్టీ కోసం పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన చెందుతున్నారట ఆ నేతలు. 

బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఇంచార్జీలను నియమించింది. సీనియర్లకు కొన్ని జిల్లాలను అప్పగించారు. మరికొందరికి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. తమను పార్టీ గుర్తించిందని సముచిత స్థానం కల్పించిందని సంబరపడ్డారు ఇంఛార్జీలు. అయితే నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణకు ఎల్ బి నగర్, సీనియర్ నేతలు అల్జాపూర్ శ్రీనివాస్‌కు ఆదిలాబాద్, పల్లె గంగారెడ్డికి మంచిర్యాల, ధన్‌పాల్ సూర్యనారాయణకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, పెద్దోళ్ల గంగారెడ్డి, నాయుడు ప్రకాష్ నేతలకు ఇంఛార్జీలుగా నియమించారు. 

వీరికి కొత్త చిక్కు వచ్చి పడిందంటున్నారిప్పుడు. ఇంఛార్జీలుగా ఉన్న వారు వచ్చే ఎన్నికల్లో పోటీకి అనర్హులంటూ ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ బన్సల్ షాక్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఈ ఫార్ములా బాగా కలిసి వచ్చిందని తెలంగాణలో కూడా ఇదే అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారట. ఈ ప్రకటనతో నేతలంతా ఒక్కసారిగా అవాక్కాయ్యారని తెలుస్తోంది. ఇలా అయితే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటన్నదానిపై వారంతా మధనపడుతున్నారని తెలుస్తోంది. 

ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎదుట సదరు నేతలు మొరపెట్టుకున్నారని సమాచారం. అయితే 6 నెలల పాటు పని చేయండి పర్ఫార్మెన్స్‌ను బట్టి సడలింపు ఇప్పిస్తామని బండి భరోసా ఇస్తున్నారట. అధినేత అభయమిచ్చినా.... సంతృప్తి చెందని కొందరు నేతలు ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటామని ఇప్పటికే  ప్రకటించారట. పార్టీ కోసం అనేక త్యాగాలకు సిద్ధపడిన తమకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇస్తేనే బాధ్యతలు నెరవేరుస్తామని మరికొందరు చెబుతున్నారట.

మొత్తానికి ఈ నిబంధన ఇప్పుడు కమలం పార్టీలో కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ... అర్బన్ నుంచి మరోసారి పోటీకి సై అంటున్నారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా సెగ్మెంట్ మార్చినా... పోటీ కి సిద్ధం అంటున్నారట. అర్బన్‌పైనే మరో సీనియర్ నేత ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త మొదట్నుంచి గంపెడాశలు
పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి చివరి నిమిషంలో భంగ పడ్డారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మినారాయణకు అవకాశం ఇచ్చారు. 

శివసేన నుంచి బరిలో దిగేందుకు ధన్ పాల్ సిద్ధం కాగా.... పార్టీ పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగించారు. ఈసారి ఎలాగైనా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. గెలిచేందుకు పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్న తనకు ఈసారి కూడా మొండిచేయి చూపిస్తే ఎలా అంటూ ఇంచార్జి పోస్టు వద్దే వద్దంటున్నారట ధన్ పాల్. 

మరో సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ ఆర్ముర్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. రాజకీయ సమీకరణల దృష్ట్యా  గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వినయ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అల్జాపూర్‌ను బోధన్ నుంచి పోటీ చేయించారు. అటు మరో సీనియర్ నేత పల్లె గంగారెడ్డి కూడా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన వారే. గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పలు జిల్లాలకు ఇంచార్జీగా వ్యవహరించిన పల్లె గంగారెడ్డి కూడా ఇంచార్జీ పోస్టుపై అయిష్టంగా ఉన్నారని తెలిసింది.

మొత్తానికి ఈ నిబంధన జిల్లా నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఏరి కోరి తెచ్చుకున్న నేతలంతా ఇంచార్జి  బాధ్యతల నుంచి తప్పుకుంటే పరిస్థితి ఏంటని పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. ఈ వివాదంపై అభ్యంతరాలను అధిష్ఠానానికి పంపించారట. పార్టీ ముఖ్యమా ఎన్నికల్లో పోటీ ముఖ్యమా అనేదానిపై ఆసక్తికర చర్చకు తెర లేచిందన... కమలం పార్టీలో. సడలింపు నిర్ణయం కోసం వేచి చూస్తున్నారట నేతలు. మరి ఈ అంశంపై బీజేపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget