అన్వేషించండి

బాన్సువాడలో ఉద్రిక్తత- కేంద్రమంత్రి కాన్వాయ్‌ అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు!

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బాన్సువాడ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమె వచ్చినట్లు తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నిర్మలా సీతారామన్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. 

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పర్యటనకు వెళ్లిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాన్వాయ్ ను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తోందని ఆరోపిస్తూ... గో బ్యాక్ నిర్మలా సీతారామన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పాటాపోటీగా నినాదాలు చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

వ్యాక్సినేషన్ సెంటర్ పరిశీలించిన కేంద్రమంత్రి..

తెలంగాణలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ రెండో రోజు కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. లోక్‌సభ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడలో ఆమె పర్యటించారు. ఈ క్రమంలోనే వివాదం చోటు చేసుకుంది. దీని తర్వాత బీర్కూర్ మండల కేంద్రంలో రేషన్ షాప్ వద్ద లబ్ధిదారులతో ఆమె మాట్లాడారు. అనంతరం కోటగిరిలో వ్యాక్సినేషన్ సెంటర్ ను పరిశీలించి ఆ తర్వాత రుద్రుర్ లో ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. నిన్న కామారెడ్డి జిల్లాలో తొలి రోజు పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు- కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు..

మిగులు ఉన్న తెలంగాణను అప్పులమయంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే చెందుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్రం బయట తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడం లేదని బడ్జెట్ లో చాలా అప్పులు చూపించడం లేదన్నారు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో పుట్టే ప్రతీ పిల్లాడిపై లక్షా 25 వేల అప్పు ఉందని అన్నారు. దేశం మొత్తం తిరిగే ముందు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి తెలుసుకోవాలని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రాజెక్టుల వ్యయాన్ని ఇష్టం వచ్చినట్లుగా పెంచుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.20 లక్షల కోట్లకు పెంచారని తెలిపారు. తెలంగాణలో ప్రతి వంద మందిలో 99 మంది రైతులు అప్పుల పాలయ్యారని ఆరోపించారు. 

ఐఏస్ అధికారివి.. ఆమాత్రం తెలియదా..?

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంతని కలెక్టర్‌ను ప్రశ్నించారు. తనకు తెలియదన్న కలెక్టర్ సమాధానం చెప్పడంతో... ఐఏఎస్ ఆఫీసర్ అయిన మీకు ఆమాత్రం తెలియదా అంటూ కేంద్రమంత్రి ఫైర్ అయ్యారు. అరగంటలో అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకుని చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బియ్యంలో ఒక్క కేజీకి 35  రూపాయలు ఖర్చు అవుతుందని.. అందులో 5 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే రూపాయి ప్రజలు ఇస్తారని తెలిపారు. మిగతా 29 రూపాయలను కేంద్రం ఖర్చు చేస్తుందని... అలాంటప్పుడు ప్రధాని మోడీ ఫ్లెక్సీ రేషన్ షాపులో పెట్టడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget