అన్వేషించండి

MLA Rekha Nayak: బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు, వారి వల్లే తెలంగాణ ఖ్యాతి దేశం దాటింది!

MLA Rekha Nayak: బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని.. వారి వల్లే తెలంగాణ ఖ్యాతి దేశం దాటిందని ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. 

MLA Rekha Nayak: బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఖానాపూర్ మండలంలోని తర్లపాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆమె మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను.. ఇంటింటికి తీసుకో వెళ్లి ప్రతీ ఒక్కరికీ వివరించాలని సూచించారు. అలాగే ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు.

దేశంలోని పలు రాష్ట్రాలు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని.. పార్టీ శ్రేణులంతా ఐకమత్యంతో పార్టీ కోసం పని చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని అన్నారు.  రాష్ట్రం సంక్షేమ పథకాలకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే రేఖా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మరియు గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణ భవన్‌లో రోజంతా BRS నేతల వరుస ప్రెస్ మీట్లు 
బీఆర్‌ఎస్‌ నేతలు వరుసబెట్టి బీజేపీకి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా నేతలంతా విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో రోజంతా గులాబీ నేతల హడావిడి కనిపించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకరితర్వాత ఒకరు వచ్చి ప్రెస్‌మీట్లు పెట్టి బీజేపీ మీద ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ మోదీ టూర్‌కు దూరంగా ఉంటారని కూడా క్లారిటీ ఇచ్చారు. సింగరేణి సమ్మె మోత మోగుతుందని అన్నారు. కోల్ బెల్ట్ ఏరియాల్లో బీజేపీ నేతలను తిరగనివ్వబోమని BRS నేతలు తేల్చిచెప్పారు. 

ప్రధాని సభకు కేసీఆర్ రావడం లేదు- వినోద్ కుమార్

ప్రధాని మోదీ తెలంగాణను గందరగోళ పరచాలని చూస్తున్నారన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘ వైస్ చెర్మన్ వినోద్ కుమార్. అభివృద్ధిలో తెలంగాణకు వీసమెత్తు సాయం చేయడం లేదన్నారు. జాతీయ రహదారుల విషయంలో నితిన్ గడ్కరీ దగ్గరికి పోతే నేనేం చెయ్యాలి అని అన్నారని తెలిపారు. ఇప్పుడు ఉన్నది మునుపటి బీజేపీ పార్టీ కాదు. ప్రధాని తెలంగాణకు జాతీయ రహదారులు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నవోదయ విద్యాలయాలు కొత్త జిల్లాలకు ఇవ్వాలనే హామీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు? తెలంగాణ ప్రజలకు చట్టబద్దంగా రావాల్సినవి రావడం లేదని.. మోదీ మేం అడిగిన వాటికి సమాధానం చెప్పాలన్నారు. రేపు ప్రధాని సభకు సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు.. ఆయన ఒక్కరే వచ్చి పోతారని క్లారిటీ ఇచ్చారు వినోద్ కుమార్.

బండి సంజయ్ విచిత్రంగా మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. సంజయ్ విద్యార్థులు జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారని... రెండు పేపర్లు లీక్ కావడానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఎన్ని పాపాలైనా చేయాలి పవర్‌లోకి రావాలి అనేది బీజేపీ విధానమన్నారు. అసలు ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావ్ అని బండిని ప్రశ్నించారు. పొరపాటును ఇప్పటికైనా ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీ అంటే బ్రోకర్. జే అంటే జుమ్లా. పీ అంటే పేపర్ లీకేజ్ పాలిటిక్స్ అన్నారు. బండి మీద యాక్షన్ తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఇందులో సంబంధం ఉన్నట్లే అన్నారు మంత్రి ఎర్రబెల్లి   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Embed widget