Mancherial: బ్లేడుతో గొంతుకోసుకున్న బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్, ఎమ్మెల్యే వేధింపులే కారణమా!
Mancherial News l కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వేధింపులు తాళలేక బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ సత్యనారాయణ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
BRS municipal councilor attempted suicide in Mancherial l మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎసిపి కార్యాలయం ఆవరణంలో నస్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ బేర సత్యనారాయణ గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నం చేశారు. తనపై మంచిర్యాల ఏసిపి ప్రకాష్ అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును బనాయించారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎసిపి కార్యాలయంలోనే గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు హుటాహుటిన సత్యనారాయణను ఆసుపత్రికి తరలించారు.
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వేనెంబర్ 14 భూమిని కౌన్సిలర్ బేర సత్యనారాయణ కబ్జా చేశారని ఆరోపణలున్నాయి. మున్సిపల్ కమిషనర్ ను కులం పేరుతో దూషించారని ఆయన ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని సత్యనారాయణ రోదించారు. కబ్జా జరిగిన విషయం గురించి తనకు సంబంధం లేదని, ఆ సంఘటన జరిగిన రోజు ఆయన తిరుపతిలో ఉన్నానని బాధితుడు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ కక్షపూరితంగానే తనను ఇబ్బంది పెడుతున్నారని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే తన తండ్రిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని సత్యనారాయణ కూతురు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ జరిగిన విషయాన్ని ఆమె వివరించారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వేధింపులు భరించలేక నస్పూర్ మున్సిపల్ 21 వ కౌన్సిలర్ బేర సత్యనారాయణ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం దారుణం.
— Harish Rao Thanneeru (@BRSHarish) August 18, 2024
రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా, పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి అరెస్టులు చేయించాలని చూడటం హేయమైన చర్య.
తెలంగాణ… pic.twitter.com/MZd5V51j38
రాజకీయ కక్షతో వేధింపులు, అక్రమ కేసులు: హరీష్ రావు
బీఆర్ఎస్ నేత గోంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వేధింపులు భరించలేక నస్పూర్ మున్సిపల్ 21 వ కౌన్సిలర్ సత్యనారాయణ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం దారుణం అన్నారు. రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా, అక్రమ కేసులు పెట్టించి అరెస్టులు చేయించాలని చూడటం హేయమైన చర్యగా హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రతీకార చర్యల సంస్కృతికి స్థానం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించిన హరీష్ రావు, బాధ్యుల పట్ల తెలంగాణ డీజీపీ కఠినంగా వ్యవహరించాలనీ, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.