Nizamabad News: బొప్పాయి పంట కోసం హీరోయిన్లు నిలబెట్టేశాడు- రైతు తెలివితేటలకు జనం సర్‌ప్రైజ్
పంటలకు దిష్టి తగలకూడదని ఓ రైతు ఢిపరెంట్ థాట్. హీరోయిన్స్ ఫెక్సీలను దిష్టి కోసం పెట్టిన వైనం. చూపరులను ఆకర్షిస్తున్న హీరోయిన్స్ ఫ్లెక్సీలు.
ఒక్కో బుర్రకు ఒక్కో ఆలోచన. తాను పండించే పంటలకు నరదిష్టి తగలకూడదని సమ్ థింగ్ డిఫెరెంట్ గా ఆలోచించాడు ఓ రైతు. అతని వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. అటువైపు వెళ్లే వారంతా పంటలను చూడకుండా అందమైన హీరోయిన్స్ ఫ్లెక్సీలను పెట్టేశాడు. అటుగా వెళ్లేవాళ్లంతా వాటిని చూస్తు వెళ్లిపోతున్నారు. సమంత, పూజా హెగ్డే, రష్మిక మందాన, తమన్నా ఇలా అందరు టాప్ హీరోయిన్లు ఒకేచోట కనిపిస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలోని ఓ తోటలో ఇప్పుడు ఈ హీరోయిన్లంతా సందడి చేస్తున్నారు.
రైతు తోటలో టాప్ హీరోయిన్ల ఫోటోలు
అసలు విషయానికొస్తే... నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపురం గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తన పొలంలో టాప్ హీరోయిన్ల అందమైన ఫోటోలను పెద్ద పెద్ద పోస్టర్ల చేసి పెట్టించాడు. ఇప్పుడు శ్రీనివాస్ వేయించిన పోస్టర్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. వివిధ ఫోజుల్లో ఆకట్టుకునే రంగులతో టాప్ హీరోయిన్ ల ఫోటోలు పొలంలో ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ రైతు ఆదర్శ వ్యవసాయం.. చుట్టూ ప్రక్కల గ్రామాల్లో అందరి దృష్టి ఆయన సాగుపైనే....
శ్రీనివాస్ రెడ్డి 9 ఎకరాల్లో ఆదర్శ వ్యవసాయం చేస్తున్నారు. ఆయన ప్రధానంగా బొప్పాయి పంటను వేశారు. బొప్పాయితో పాటుగా అంతరపంటగా బంతి, దానిమ్మ వంటి పంటలు వేశారు. ఇక శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న ఆదర్శ వ్యవసాయం ఆ చుట్టుపక్కల గ్రామాల వారందరినీ ఆకర్షిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆయన వ్యవసాయం చేస్తున్న తీరు తెలుసుకోవడం కోసం ఆయన పంట పొలంలోకి వెళ్లి మరీ చూస్తున్నారు.
ఏపుగా పెరిగిన బొప్పాయి ఇస్తున్న దిగుబడులు, అంతర పంటలు ఇస్తున్న ఫలసాయం నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల వారు ఆయన సాగు తీరును తెగ మెచ్చుకుంటున్నారు. వచ్చిన వారి దృష్టంతా పళ్లపై పడటంతో వాటికి దిష్టి తగులుతుందనే భయంతో ఇలా హీరోయిన్స్ ఫోటోలతో ప్లెక్సీలను ఏర్పాటు చేయించారని చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే వరంతా ఆ ఫోటోలను చూస్తున్నారని పంటలపై వారి దృష్టి మరలుతుందని శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. దీంతో తన ప్లాన్ వర్క్ అవుట్ అయిందంటూ సంబరపడిపోతున్నారు రైతు శ్రీనివాస్ రెడ్డి.