MLC Kavitha Birthday: సముద్రం అడుగున ‘కవిత అక్క బర్త్ డే’ - ఓ వీరాభిమాని సాహసం
నీటి అడుగున స్కూబా డైవింగ్ చేస్తూ బ్యానర్లను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను షూట్ చేసి ట్విటర్‌లో ఉంచారు.
అభిమాన రాజకీయ నేతల కోసం కొంత మంది ఎంతటి సాహసానికైనా వెనకాడరు. పుట్టినరోజులు వంటి శుభకార్యాల సమయంలో వినూత్నంగా అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగాళాఖాతం సముద్రపు అంచుల్లోకి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు ముద్రించిన బ్యానర్లను ప్రదర్శించారు.
నీటి అడుగున స్కూబా డైవింగ్ చేస్తూ బ్యానర్లను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను షూట్ చేసి ట్విటర్‌లో ఉంచారు. దీన్ని టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అండమాన్ నికోబార్ దీవుల్లో బంగాళాఖాతం సముద్రపు అడుగుభాగాన 'హ్యపీ బర్త్ డే కవిత అక్క' అని రాసి ఉన్న బ్యానర్లను చిన్ను గౌడ్ ప్రదర్శించారు. మరికొన్ని జెండాలపై కల్వకుంట్ల 'కవితకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ బ్యానర్లు ప్రదర్శించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ జెండాలపై బీఆర్ఎస్ ముద్రతో పాటు, కవిత, కేసీఆర్ ఫోటోలను ముద్రించారు. ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని సముద్రం దిగువకు వెళ్లి అటూ ఇటూ తిరుగుతూ ప్రదర్శించిన బ్యానర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.