News
News
X

Eatala Rajender: మంత్రుల మాటలు కేసీఆర్ కేర్ చెయ్యలేదు, అందుకే ఈ సమస్యలు - ఈటల రాజేందర్

కామారెడ్డి బీజేపీ ఇంఛార్జి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష పూర్తిగా న్యాయబద్ధమైందని, అతనికి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని ఈటల రాజేందర్ వెల్లడించారు.

FOLLOW US: 
 
పెద్ద నాయకుల అవసరాలు తీర్చుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను తీసుకువచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ధరణితో తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కేవలం కమీషన్ల కోసమే సీఎం కేసీఅర్ ధరణి తెచ్చారని, దీనివల్ల రైతులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ కేవలం కేసీఆర్ కోసం మాత్రమే ఉందని, ఆయన కుటుంబం కోసమే పని చేస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రజలు, రైతుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

తెలంగాణలో కేసీఆర్ చెప్పిందే వేదంలా నడుస్తుందని విమర్శించారు. కామారెడ్డి బీజేపీ ఇంఛార్జి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష పూర్తిగా న్యాయబద్ధమైందని, అతనికి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంతో పోరాడి సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి దీక్ష విరమించాలని ఈటల కోరారు. ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ ధరణి సమస్య కేవలం కామారెడ్డి జిల్లా సమస్యే కాదని, రాష్ట్రంలో ఉన్న రైతులందరి సమస్య అని ఈటల అన్నారు. కాబట్టి బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్లుగా మండిపడ్డారు. 

రైతుల సమస్యలు పరిష్కరించడంలో దేశంలోనే ధరణి మంచి ఫలితం సాధిస్తుందని కేసీఆర్ ఈ పోర్టల్ తెచ్చారు. ఫిర్యాదుల రూపంలో సుమారు 20 లక్షల దరఖాస్తులు ధరణి సమస్యలపై వచ్చాయి. ఈ పోర్టల్ ద్వారా వస్తున్న సమస్యలు చూసి ఇది వద్ద చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. కేసీఆర్ ఎవరి మాట వినే రకం కాదని, ఎమ్మెల్యేలు, మంత్రుల మాట అస్సలు కేర్ చేయరని అన్నారు. దేశంలోనే ఒక ఎమ్‌ఆర్ఓ మీద పెట్రోల్ పోసి చంపే నీచ సంస్కృతికి తెలంగాణలో తెర లేపారని విమర్శించారు.

తెలంగాణలో ప్రస్తుతం పండగలు వస్తే ఉద్యోగులకు టైంకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోవాలన్నా, అప్పుల కుంపటి నుంచి బయటపడాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేళ్లతో సహా కూల్చడమే ఇప్పుడున్న ఏకైక మార్గం అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

News Reels

హైదరాబాద్ చుట్టూ వారసులు లేని భూముల వివరాలు తెప్పించుకుని ధరణి పోర్టల్ ద్వారా ఈటల రాజేందర్ వేల కోట్ల సంపాదనకు ప్లాన్ చేశారని విమర్శించారు. తన భూమి ఉంటుందో పోతుందో అని రైతులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి కేసీఆర్ హయాంలో ఉందని అన్నారు. సమస్య కోసం ఒక రైతు పదిసార్లు దరఖాస్తు చేస్తే రూ.10 వేలు ఖర్చవుతోందని, హైదరాబాద్ చుట్టూ 5,600 ఎకరాలు, 50 వేల కోట్ల భూములను ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూములను బినామీల పేరుతో ఉన్న కంపెనీలకు కట్టబెడుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలు గట్టిగా ఉంటే తట్టుకోలేమని, అసెంబ్లీకి వస్తే వీటన్నింటిపైన ప్రశ్నిస్తారనే భయంతో అక్కడికి రాకుండా చేస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. 

Published at : 29 Sep 2022 03:02 PM (IST) Tags: Dharani Portal CM KCR eatala rajender kamareddy Katipally ramana reddy

సంబంధిత కథనాలు

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ విడుదల 

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ విడుదల 

నేడు తెలంగాణలో ఏం జరగబోతున్నాయంటే?

నేడు తెలంగాణలో ఏం జరగబోతున్నాయంటే?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

టాప్ స్టోరీస్

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!